

– బిజెపి రాష్ట్ర నాయకులు కొలను శంకర్ రెడ్డి
క్రైమ్ మిర్రర్, మహేశ్వరం: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు కొలను శంకర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ప్రజా సంగ్రామ యాత్ర జరిగిన సభలో కార్యకర్తలతో కలిసి బీజేపీ రాష్ట్ర నేత, యాత్ర రాష్ట్ర వసతుల కమిటీ సభ్యులు కొలన్ శంకర్ రెడ్డి నాయకత్వంలో ర్యాలీగా వెళ్లి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు కొలను శంకర్ రెడ్డి , జగన్ మోహన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, పవనకుమార్, బాలచందర్, నరేశ్, సంజీవ రెడ్డి, శేఖర్, ఎం మహేందర్, ఉజ్వల్ , శ్రీనుయాదవ్, ప్రవిన్ గౌడ్, శ్రీకాంత్, దిలీప్, బాలచందర్ పాల్గొన్నారు.