

క్రైమ్ మిర్రర్, భూపాలపల్లిః ప్రతిఒక్కరూ కోవిడ్ టీకా వేసుకోవాలని ఎల్లారెడ్డిపల్లె సర్పంచ్ పెంతల రాజేందర్ రెడ్డి అన్నారు. గ్రామంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ కోవిడ్ టీకాను వేసుకోవాలని సూచించారు. అదేవిధంగా అందరూ మాస్క్లు ధరిస్తూ భౌతికదూరం పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అజిరా బేగం, వార్డుసభ్యులు నిమ్మల భద్రయ్య స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.