

తుర్కయంజాల్, ఆగస్టు 11, క్రైమ్ మిర్రర్: తుర్కయంజాల్ మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ రొక్కం అనితా చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో 5 లక్షల రూపాయలతో చేపట్టిన సి సి రోడ్డు పనులను మల్ రెడ్డి అనురాధ రాంరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రజల యొక్క సంక్షేమం కోసం మున్సిపాలిటీ నందు అభివృద్ధి పథంలో నడిపేందుకు పార్టీలకతీతంగా ప్రణాళికాబద్ధంగా కౌన్సిలర్ల సూచనల మేరకు అన్ని వార్డ్ లను కూడా సమాంతరంగా అభివృద్ధి చేసుకోవడంతో ముందుకు జరుగుతుందని తెలిపారు.
స్థానికంగా ఉన్న అనేక సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అతి త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీ మరియు ఆదర్శ వార్డ్ గా తీర్చి దిద్దే అందుకు నా వంతు సహాయం చేస్తానని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ హరిత ధనరాజ్ గౌడ్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కోసికె ఐలయ్య, రంగారెడ్డి జిల్లా కౌన్సిలర్ అసోసియేషన్ అధ్యక్షురాలు కొత్త కుర్మా మంగమ్మ శివకుమార్, కౌన్సిలర్లు కుంట ఉదయశ్రీ గోపాల్ రెడ్డి, మెతురి అనురాధ దర్శన్, బొక్క రవీందర్ రెడ్డి, మర్రి మాధవి మహేందర్ రెడ్డి, బొక్క శ్రీ లత గౌతమ్ రెడ్డి, రేవల్లి హరిత యాదగిరి, బొక్క రవీందర్ రెడ్డి, కంబాలపల్లి ధన్ రాజ్, తొర్రూరు మాజీ సర్పంచి మేకం అంజయ్య,జగన్మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.