

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, ఆగస్టు 9, క్రైమ్ మిర్రర్: ఆలేరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నందరాజ్ గౌడ్ జండా ఆవిష్కరించి, ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ 58వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలను నిర్వహించారు. సోమవారం ఈ సందర్భంగా నంద రాజు గౌడ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు, ఉద్యోగాలు అవకాశాలు కల్పించడంలో విఫలం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు భర్తీ చేయాలని అలాగే కేసీఆర్ ప్రభుత్వం చెప్పినటువంటి నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, యువత తలుచుకుంటే ఈ ప్రభుత్వాలకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సాధు వెళ్లి రాజశేఖర్ ఆలేరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిలు కర్రే అజయ్,బుగ్గ మహేష్ కొండరాజు వెంకటేశ్వర రాజు, పర్రె రమేష్,ఊట్కూరి సురేష్, జూకంటి సంపత్,అడిగే అనిల్,బండ్రు జాంగిర్ కాండ్రజు శివశంకర్ కలకుంట్ల లోకేష్ దూసరి మురళి కిష్టయ్య సుంకరి విక్రమ్,అంజనేయులు కాసుల భాస్కర్, అందే అఖిల్ ,గరికపాటి జానకిరామ్,అంగిడి ఆంజనేయులు నల్ల బాసర రమేష్ కడకంచి సిద్ధులు,నోముల ప్రశాంత్,బందారపు శివ డేగల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.