

- కథనంకు స్పందించిన అధికారులు
- అంతరాష్ట్ర వంతెన వద్ద వాహనం సీజ్
- ఎరువుల అక్రమ రవాణాకు చెక్ అంటున్న అధికారులు
మహాదేవ్ పుర్, క్రైమ్ మిర్రర్ జులై 28 : మహారాష్ట్ర -తెలంగాణ కు సరిహద్దు ప్రాంతంమైన మహాదేవ్ పుర్ (తెలంగాణ కు చెందిన) మండలం నుండి మహారాష్ట్ర లోని పలు గ్రామాలకు అక్రమ ఎరువుల రవాణా జరుగుతుందని గత సోమవారం క్రైమ్ మిర్రర్ లో ప్రచురితమైన కథనంతో చలించిన అధికార యంత్రాంగం తక్షణం స్పందింది మండలంలోని ఎరువుల విక్రయ కేంద్రాలలో రికార్డ్ ల తనిఖీలు వేగవంతం చేసారు. వ్యవసాయాధికారుల తనిఖీల్లో భాగంగా మంగళవారం సూరారం గ్రామంలోని ఎరువుల విక్రయకేంద్రంలో రికార్డ్ లను పరిశీలించి సరైన రికార్డ్ లు లేని కారణంగా వారి లైసెన్స్ రద్దు కు సిఫరస్ చేసారు.
ఇదేక్రమంలో మేడిగడ్ద (లక్ష్మీ) బ్యారేజ్ వద్ద వ్యవసాయశాఖాధికారుల ఆధ్వర్యంలో బుధవారం చేసిన వాహన తనిఖీల్లో తెలంగాణ నుండి అక్రమంగా మహారాష్ట్రలోని నడిగుడ గ్రామానికి ఎరువులు తీసుకువెలుతున్న వాహనం (ఏపి 36 వై 3178) ను సీజ్ చేసి సమీపంలోని పలిమెల పోలీస్ స్టేషన్ కు తరలించారు, పట్టుబడిన వాహనంలో 40 బస్తాలు ఉన్నట్లు వ్యవసాయశాఖాధికారులు మీడియాకు తెలిపారు. పట్టుబడిన వాహనం పరకాల పట్టణంలోని శ్రీ సీతారామ ఫెర్టిలైజర్ షాపు నుండి వస్తుంది అని వ్యవసాయశాఖాధికారులు మీడియా కు తెలిపారు.