

కెసిఆర్ పై మడ్డిపడ్డ కొలను శంకర్ రెడ్డి
మహేశ్వరం జులై 26 (క్రైమ్ మిర్రర్): మహేశ్వరం నియోజకవర్గం పరిధి బాలపూర్ లో డప్పు చెప్పు కార్యక్రమంలో పాల్గొన్న దళిత ప్రజలు బీజేపీ నాయకులు ఈ సందర్భంగా కొలను శంకర్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ హుజురాబాద్ బై ఎలక్షన్స్ జరుగ బోయే సమయంలో దళిత బంధు అని ఒక మోస పురిత ప్రకటన చేస్తూ ప్రజల్లో ఒక వింత నాటకం ఆడుతున్నడని హుజురాబాద్ నియోజకవర్గంలో 21000 వేల దళితులకు 2 వేల రెండు వందల కోట్లు ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటిస్తున్నారు. ఇదే ప్రకటన తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 25 వేల కుటుంబాలకు ఎంచుకొని వారికి కూడా దళిత బందు పథకాన్ని అమలు చేయాలని కోరారు. 4 కోట్ల మంది ప్రజలు ఉద్యమంలో పాల్గొని అందులో దళితులు కూడా ప్రాణాలు అర్పించారు అన్నారు. తెలంగాణా కోసం 12 వందల మంది బలిదానాలు చేశారు. తెలంగాణా చిన్నమ్మ సుష్మా స్వరాజ్, లాల్ కృష్ణ అద్వానీ నైపుణ్యంతో తెలంగాణా సాదించుకున్నామని అన్నారు. కానీ తెలంగాణా రాష్టం ఏర్పడగానే ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అన్న కెసిఆర్ మాట తప్పి తన స్వంత కుటుంబ్బన్నే పాలనదికరంలో పెట్టి దళితులను మోసం చేసాడు త్వరలో నే కేసీఆర్ ను గద్దె దించే రోజులు దగ్గరలో ఉన్నాయని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.