HyderabadRangareddyTelangana

టీఎస్‌ బీపాస్‌తో వీఆర్వోలు… ఆర్‌ఐలకు కాసుల పంట

  • అడిగినంత ఇచ్చారా సరే… సరి లేదంటే
  • నిర్మాణ అనుమతి దరఖాస్తుల తిరస్మరణ
  • శివారు మున్సిపాలిటీల్లో అంతటా ఇదే తంతు
  • అవినీతి అడ్డుకట్ట వేస్తుందనుకున్న…
  • బీపాస్‌తో పెరిగిన అవినీతి, అక్రమాలు
  • అడిగినంత ఎక్కడ తెచ్చిచ్చేదన్న ఆందోళనలో దరఖాస్తుదారులు

 

(బద్దుల శ్రీధర్‌ యాదవ్‌)

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్‌: భవన నిర్మాణ అనుమతుల్లో అవినీతి అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన టీ-ఎస్‌ బీపాస్‌ వీఆర్వోలు, ఆర్‌ఐలకు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. వీఆర్వోలు, ఆర్‌ఐలు అడిగినంత ముట్టచెప్పకపోతే, భవన నిర్మాణదరఖాస్తుదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. నగర శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఇంటి నిర్మాణ అనుమతి కోసం గతంలో డీపీఎంఎస్‌ విధానం ద్వారా నిర్మాణ అనుమతులకు ప్లాట్ల యజమానులు దరఖాస్తుకు చేసుకునేవారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డీపీఎంఎస్‌ విధానం ఎందుకు నచ్చలేదో… ఏమో కానీ టీఎస్‌ బీపాస్‌ అంటూ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. అవినీతి అడ్డవికోవడమే లక్ష్యమని, భవననిర్మాణదారునికి 21 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తామంటూ మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీ రామారావు, ఈ విధానం గురించి ఊదరగొట్టారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉన్నది. టీఎస్‌ బీపాస్‌ విధానం అమల్లోకి రాగానే తమకు 21 రోజుల్లోనే అనుమతులు రానున్నాయంటూ భవననిర్మాణ అనుమతి కోసం దరఖాస్తులు చేసుకున్న వారు సంతోషపడ్డారు. కానీ వారి ఊహించినది ఒకటైతే క్షేతస్థాయిలో జరుగుతున్న తంతు మరొకటి కావడం విడ్డూరంగా ఉంది. టీఎస్‌ బీపాస్‌ ద్వారా భవననిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగానే, వ్లాట్‌ వైశాల్యాన్ని పరిగణలోకి తీసుకుని ఎంత ఫీజు చెల్లించాలో అంచనా వేసి, అంత ఫీజు మొత్తాన్ని ముందుగానే చెల్లించాలన్న నిబంధనను విధించారు. ఫీజు చెల్లించిన దరఖాస్తుదారుడికి ఉన్న ష్లాట్స్‌ సర్వే నెంబర్‌ ఏ జోన్‌ పరిధిలో ఉందో పరిశీలించి, టెక్నికల్‌ అధికారికి నివేదించే బాధ్యతలను ఆయా ప్రాంతాలకు వీఆర్బో, ఆర్‌ఐలకు అధికారాన్ని ప్రభుత్వం కట్టబెట్టింది. అదే వీఆర్వోలు, ఆర్‌ఐలకు ఇప్పుడు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. భవన నిర్మాణ అనుమతికి చేసుకున్న దరఖాస్తు తన వద్దకు చేరగానే సదరు వీఆర్బో, ఆర్‌ఐ దరఖాస్తుదారుడికి ఫోన్‌ చేసి ష్లాట్‌ను చూపించాలని కోరుతున్నాడు.

అసలు దరఖాస్తుదారునికి వీఆర్బో, ఆర్‌ఐలు ఫోన్‌ చేసి ప్లాట్‌ చూపించమని అడగాల్సిన అవసరమే లేదు… ఎందుకంటే సదరు సర్వే నెంబర్‌ ఎక్కడ ఉన్నది, ఆ సర్వే నెంబర్‌ ఏ జోన్‌ పరిధిలో వస్తుందన్న విషయ పరిజ్ఞానం వారికి ఉంటుందనే కారణంతోనే ఆ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. అయితే దరఖాస్తుదారునికి ఫోన్‌ చేసి ఆయన్ని ఫ్లాట్‌ వద్దకు పిలిపించుకోవడం వెనుక వారి మతలబు వేరే. దరఖాస్తుదారుడు ఫ్లాట్‌ వద్దకు చేరుకోగానే సదరు సర్వే నెంబర్‌ కన్దర్వేషన్‌ జోన్‌లో, చెరువు దగ్గరగా ఉంటే ఎఫ్‌టీఎల్‌ లేదంటే బఫర్‌ జోన్‌, అది కాకపోతే యూఎల్‌సీలో ఉందని, అంతకాదంటే ఈ సర్వే నెంబర్‌లో పర్మిషన్లు ఇవ్వడం లేదని చెప్పి… ఇదే విషయాన్ని తాము టెక్నికల్‌ అధికారికి నివేదిస్తామని హడల్‌ కొడుతున్నారు. దానితో లక్షల రూ.లు ముందుగానే ఫీజులు చెల్లించిన దరఖాస్తుదారుడు ఠారెత్తిపోతున్నాడు. ఇప్పుడు ఎలా అంటూ వీఆర్బో, ఆర్‌ఐలనే సలహాలు అడుగుతున్నారు. అదే అదనుగా వీఆర్వోలు, ఆర్‌ఐలు తమ భేరసారాలను మొదలుపెడుతున్నారు. తాము చెప్పినంత ఇవ్వకపోతే దరఖాస్తులను తిరస్కరించాలని నివేదిస్తామని హెచ్చరికలు చేస్తుందడంతో, చేసేది లేక సామాన్యులు వారి అడిగిన మొత్తాన్ని చేతిలో పెట్టి ఫీల్డ్‌ విజిట్‌ తతంగాన్ని పూర్తి చేయించుకుంటున్నారు.

అవినీతిని అరికట్టడమే లక్ష్యంగా తీసుకువచ్చిన టీఎస్‌ బీపాస్‌ విధానంలో గతంలో కంటే ఎక్కువ అవినీతి జరుగుతోందని దరఖాస్తుదారులు వాపోతున్నారు. గతంలో డీపీఎంఎస్‌ విధానం ద్వారా కేవలం టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు, సిబ్బందికి మాత్రమే ఎంతో కొంత మొత్తం ముట్టచెప్పి దరఖాస్తుల పరిశీలన చేయించుకుని, అనుమతులను పొందేవారమని, కానీ ఇప్పుడు అదనంగా రెవిన్యూ వారికి కూడా అమ్యమ్యాలు చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

main qimg a9476644f750008a1be4f48c12462b71 - Crime Mirror

శివార్ల ఎక్కడ చూసిన ఇదే తంతు…

శివారు తుర్మయంజాల్‌, పెద్ద అంబర్‌పేట, ఆదిభట్ల , తుక్కుగూడ, జల్‌పల్లి మున్సిపాలిటీలు, మీర్‌పేట, బడంగ్‌పేట, బండ్లగూడ, బోడుప్పల్‌, ఫిర్దాదీగూడ మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో ఇదే తంతు కొనసాగుతోంది. తురయంజాల్‌ మున్సిపల్‌ పరిధిలో టీఎస్‌ బీపాస్‌ దరఖాస్తుల పరిశీలించే వీఆర్వో ఒకరు ఏకంగా ప్రెవేట్‌ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని అవినీతికి పాల్చడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే పెద్ద అంబర్‌పేటలోను ఇదే తంతు కొనసాగుతోంది. భవననిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వారు అమ్యమ్యాలు ముట్టచెప్పితే వీరు సదరు సర్వే నెంబర్లు బఫర్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న ఓకే చెబితే, తాము అడిగినంత ఇవ్వకపోతే ఏదో కుంటిసాకులు చెబుతూ, దరఖాస్తులను తిరస్మరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కన్లర్వేషన్‌ జోన్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం గతంలో వెయ్యి రూ.లు చెల్లించి ఉన్న దరఖాస్తులను పరిగణలోకి తీసుకుని, కొంతమొత్తం ఫీజు వసూలు చేసి అనుమతులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసినా, వీరు మాత్రం తమకు ముడుపులు ముట్టచెప్పకపోతే వాటిని తిరస్మరిస్తున్నారని దరఖాస్తుదారులు వాపోతున్నారు.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.