

- దేవేందర్‌తో జరిపిన రాయభారం సక్సెస్
- ఇక టీఆర్ఎస్ అసంతృప్త నేతల తదుపరి లక్ష్యం
- ఒక మాజీమంత్రి… మరో మాజీ ఎమ్మెల్యేతో మంతనాలు
- సొంతగూటికే తెరాసకు చెందిన ఓబీసీ నేత ?
(బద్దుల శ్రీధర్ యాదవ్)
క్రైమ్ మిర్రర్ – హైదరాబాద్: తెలుగుదేశంపార్టీలో ఒక వెలుగు వెలిగి అధికార తెరాస పార్టీలో చేరిన నేతలే లక్ష్యంగా టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉమడి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా, టీడీపీ పొలిట్బ్యూరోసభ్యునిగా వ్యవహరించిన తూళ్ల దేవేందర్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రేవంత్, త్వరలోనే ఒక మాజీమంత్రి, మాజీ ఎమ్మెల్యేను సైతం కలిసే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరినవారే కావడం… ప్రస్తుతం ఈ ఇద్దరు నాయకులకు అధికార తెరాస పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో వారు కూడా తమ భవిష్యత్తు రాజకీయజీవితం కోసం పక్క చూపులు చూస్తున్నట్లు ఊహగహానాలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పటికిప్పుడే వారు అధికార తెరాసను వీదే అవకాశాలెంత మాత్రం లేకపోయినప్పటికీ, భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చునని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అధికారపార్టీలో చేరిన ఒక మాజీ ఎమ్మెల్యేకు ప్రస్తుతం తెరాసలో ఎటువంటి ప్రాధాన్యతన్నది లేకుండా పోయింది. దానికితోడు కాంగ్రైస్పార్టీలో గెల్చిన తెరాసలో చేరిన ఒక ఎమ్మెల్యే, తన వర్గాన్ని పూర్తిగా దెబ్బతీసే ప్రయత్నం చేయడం పట్ల ఆయన లోలోపల రగిలిపోతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గం వారికి కనీసం ఒకటి, రెండు కార్పొరేటర్ల స్థానాలు కూడా కేటాయించకపోవడంతో ఏమి చేయాలో పాలుపోని ఆయన పార్టీ అగ్రనాయకత్వానికి మొరపెట్టుకున్నారు.
పార్టీ నాయకత్వం మాత్రం అంత ఎమ్మెల్యేల ఇష్టమని చెప్పడంతో చేసేది లేక అదను కోసం సదరు మాజీ ఎమ్మెల్యే ఎదురుచూస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల సదరు మాజీ ఎమ్మెల్యే కాషాయ కందువా కూడా కప్పుకోనున్నారన్న ఊహగహానాలు వినిపించాయి. అయితే ఆ ఊహగహానాల్ని సదరు మాజీ ఎమ్మెల్యే తోసిపుచ్చారు. ప్రస్తుతం కూడా అటువంటి ప్రచారమే జరుగుతున్నప్పటికీ నోరు మెదపకపోవడం పరిశీలిస్తే… ఆయన మౌనం అర్థ అంగీకారమనే భావించాల్సి వస్తుందని నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నేతలు చెప్పుకొచ్చారు.
ఇక మాజీ మంత్రి విషయానికొస్తే, రేవంత్‌కు అత్యంత సన్నిహితుదైన మరొక జిల్లా నేతకు మధ్య రాజకీయవైరముండడం వల్ల ఆయన కాంగ్రెస్‌లో చేరుతారా?, లేక బీజేపీ వైపు మొగ్గు చూపుతారా ?? అన్నది హాట్ టాఫిక్‌గా మారింది. ఇక ఎల్బీనగర్కు చెందిన ఒక బీసీ నేత సైతం కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు లేకపోలేదంటున్నారు. తెరాస నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరిక్షించుకున్న సదరు నాయకుడు, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్షీకి సమీప బంధువు కావడం, స్థానిక ఎమ్మెల్యేతో ఆయనకున్న రాజకీయవైరం వల్ల ఎప్పుడైన సదరు బీసీ నేత తిరిగి సొంతగూటికి చేరుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు.