

మర్రిగూడ, క్రైమ్ మిర్రర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డిని సోమవారం మర్రిగూడ మండల ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి మర్యాద పూర్వకంగా అయన గృహంలో కలిశారు. ఆదివారం నాడు మంత్రి పుట్టినరోజు సందర్బంగా మంత్రికి పుష్పగుచ్ఛము అందించి శుభాకాంక్షలు తెలిపారు..అనంతరం మండల అభివృద్ధి కోసం సహకరించాలని ఎంపీపీ కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారని మండల అభివృద్ధికి పూర్తీ స్థాయిలో సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారని ఎంపిపి తెలిపారు.