HyderabadRajanna SiricillaRangareddySiddipetTelangana

హవ్వా… ఇదేమి చోద్యమో ?!

  • హుజూరాబాద్‌ నుంచి దళిత బంధా??
  • పైలెట్‌ ప్రాజెక్టుగా అమలుకు సన్నాహాలు
  • ఉప ఎన్నికల కోసమేనా… ఈ ఎత్తుగడ?
  • ప్రభుత్వ నిధులతో గెలుపుకు పథకరచన
  • రాష్ట్రంలో దళితబంధు అమలుకు 1200 కోట్లు
  • ఒక్క హుజూరాబాద్‌కే 1500 నుంచి రెండువేల కోట్లు

(బద్దుల శ్రీధర్ యాదవ్)

క్రైమ్ మిర్రర్ – హైదరాబాద్‌: ప్రభుత్వ నిధులతో హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పథకరచన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించిన దళితబంధు పథకాన్ని త్వరలోనే ఉప ఎన్నిక జరగనున్న హుజూరాబాద్‌ నుంచే తొలుత ప్రారంభించాలని నిర్ణయించారు. ఈమేరకు సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షాసమావేశంలో తన మనస్సులోని మాట ఆయన వెల్లడించారు. గత నెలలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో దళిత సాధికారిత కోసం అర్హులైన దళిత నిరుపేద కుటుంబాలకు పది లక్షల రూ.లను ఆర్థిక సహాయం చేయాలని కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు పథకం అమలుకు 1200 కోట్ల రూ.లు కేటాయించాలని నిర్ణయించిన కేసీఆర్‌ సర్కార్‌, హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి మాత్రం ప్రత్యేకంగా 15 వందల నుంచి రెండు వేల కోట్ల రూ.లు కేటాయించనుంది. ఒక్క హుజూరాబాద్‌ నియోజకవర్గంపైనే కేసీఆర్‌కు ఉన్నట్టుండి అంత పేమేందుకనీ విపక్షాలు విమర్శిస్తున్నాయి. హుజూరాబాద్‌లోనే కాదని, రాష్ట్రంలోని మిగిలిన 118 నియోజకవర్గాల్లోను దళితులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారంటున్నారు. అన్ని నియోజకవర్గాలకు 1500 నుంచి రెండు వేల కోట్ల రూ.లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తుంగతుర్తి, నాగర్జునసాగర్‌లలో జరిగిన ఉప ఎన్నికల ముందు స్థానికులకు అరచేతిలో స్వర్గం చూపించినట్లుగానే హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలను మోసం చేసేందుకే కేసీఆర్‌ ఈ ఎత్తుగడ వేశారని మండిపడుతున్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో 20 వేలపైచిలుకు దళిత కుటుంబాలున్నాయి. ఈ లెక్కన దాదాపు ప్రతీ కుటుంబానికి పది లక్షల రూ.ల ఇచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యూహాన్ని రూపొందించినట్లు కనిపిస్తోంది. అందుకే ఆనియోజకవర్గానికి ప్రత్యేకంగా 1500 నుంచి రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించినట్లు స్పష్టమవుతోంది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలు ద్వారా ఉప ఎన్నికల్లో దళితుల ఓట్లన్నీ గంపగుత్తగా తమకే పడే అవకాశాలున్నాయని అధికారపార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో వంద కుటుంబాలకు పదిలక్షల రూ.ల చొప్పున ఆర్థిక సహాయం అందజేసేందుకు రూపొందించిన ఈ పథకాన్ని, రాష్ట్రంలోని ఏ ఇతర నియోజకవర్దం నుంచి ప్రారంభించినా ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉందేది… కాదు. కానీ త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్న హుజూరాబాద్‌ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం పరిశీలిస్తే ఆయన రాజకీయ ఎత్తుగడ ఏమిటో సామాన్యుడ్షికైనా ఇట్టే అర్ధమవుతుంది. హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఇటీవల తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాజేందర్‌ నియోజకవర్గంలోనే మకాం వేసి గెలుపు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మరొకవైపు తెరాస ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇలా ఒక్కరేమిటీ.. ఆపార్టీకి చెందిన నేతలంతా రాజేందర్‌ ఓటమే లక్ష్యంగా హుజూరాబాద్‌లో మకాం వేశారు. ఇప్పటికే స్థానికంగా మద్యం, డబ్బులు ఏరులైపారుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో హుజూరాబాద్‌ నుంచే దళితబంధు పథకాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించడం విమర్శలకుదారితీసే అవకాశముంది.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.