

వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో బీర్ల ఆయిలయ్య
రాజాపేట, జులై 17 క్రైమ్ మిర్రర్: ఆలేరు నియోజకవర్గం లోని ప్రజల సేవకుడిగా కాంగ్రేస్ పార్టీ నాయకుడిగా ముందుకు వస్తున్నా అని బీర్ల ఫౌండేషన్ చైర్మన్ ఆలేరు నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య అన్నారు. మండలంలోని పుట్టగూడెం గ్రామంలో బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో మంచి నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. కంటెస్టెడ్ ఎంపిటీసి రాంజీనాయక్ చౌహన్ నేతృత్వంలో ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ విఠల్ నాయక్ ఆధ్వర్యంలో సర్పంచ్ మాడవత్ దేవి రాములు నాయక్ మరియు పుట్టగూడెం గ్రామస్థులు డప్పు చప్పుల్లతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం వాటర్ ప్లాంట్ ప్రారంభించి నీటిని తండాలోని ప్రజలకు అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
పుట్టెగూడెం గ్రామంలో ఏ కార్యాక్రమం చేసిన పండుగల చేస్తారని ఈ గిరిజనుల గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం కోసం పుట్టెగూడెం గ్రామాన్ని దత్తత తీసుకుంటానని తెలిపారు. టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో ఆలేరులో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని తెలిపారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా బీర్ల అయిలయ్య ఉన్నాడని మరిచిపోవద్దని అన్నారు.
మాట ఇచ్చి మరచిపోయే వ్యక్తి ని కాదని ప్రజాసేవకు అధికారంతో పనిలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికార టిఆర్ఎస్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని ప్రజలు ఎండగట్టాలని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి పేరుతో గజ్వేల్ జిల్లా కు మాత్రమే ముఖ్యమంత్రి గా కేసిఆర్ ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. పెద్ద పెద్ద డిగ్రీలు పిజిలు చేసి చాలా ఏండ్లుగా ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న నిరుద్యోగుల పట్ల హమాలి పని చేసుకోవాలని కించపరిచిన వారు మంత్రివర్గంలో ఉండటం టిఆర్ఎస్ పార్టీ కి ,ప్రభుత్వానికి సిగ్గుచేటని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో అధికార పార్టీ నేతలకు భూకబ్జాల పై ఉన్న ప్రేమ పరిపాలన లో లేదన్నారు. రోజు రోజుకు టిఆర్ఎస్ పార్టీ ఆగడాలు పెరుగడం ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికలలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రం లో కాంగ్రేస్ పార్టీ అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్ గౌడ్, కోమటిరెడ్డి యువసేన రాష్ట్ర అధ్యక్షులు మెండు భాస్కర్ రెడ్డి, కిసాన్ సెల్ రాష్ర్ట కార్యదర్శి బుడిగె పెంటయ్య గౌడ్, సిలువేరు బాలరాజ్, బల్ల యాదేశ్, ఇంజ నరేష్, రంగ నరేష్, ఎండి షరీఫ్, భాస్కర్ గౌడ్ ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.