

మర్రిగూడ, జులై 17 క్రైమ్ మిర్రర్:ఎక్సైజ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో రైతు ధనంజయ్ యాదవ్ వ్యవసాయ భూమిలో గ్రామ సర్పంచ్ పాక నగేష్ ఆధ్వర్యంలో 500 ఖర్జుర మొక్కలను నాటే కార్యక్రమాన్ని నాంపల్లి ఎక్సైజ్ సీఐ మాధవయ్య ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మొక్కలను నాటి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాలూ పచ్చదనంతో కళకళలాడాలంటే గ్రామస్తులంతా విధిగా మొక్కలను నాటాలని ఆయన తెలిపారు. సర్పంచ్ నగేష్ మాట్లాడుతు కరోనా సమయంలో ఏర్పడిగా ఆక్సిజన్ కొరతనుండి తమని తాము రక్షించుకుంటు అదేవిదంగా భావితరాల రక్షణ కోసం మొక్కలను నాటాలని నాటిన ప్రతి మొక్క రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు శ్రీశైలం, గీతకార్మిక సంఘము అధ్యక్షుడు పాపయ్య, గ్రామపంచాయితీ కార్యదర్శి కృష్ణయ్య, ఎక్సైజ్ సిబ్బంది నాగరాజు, అశోక్, జానీ, నాగేశ్వరరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.