HyderabadRangareddyTelangana

మాజీ సైనికునికి కూడా పంగనామాలా ?

  • భూములు లాక్కున్న కొత్తకుర్మ దంపతులు ??
  • కొత్తగా పుట్టుకొచ్చిన 54/5 న్యూ సర్వే నెంబర్ ఎక్కడిది ?
  • అధికార దుర్వినియోగం తో అక్రమ లే అవుట్
  • కొనుగోలు దారులకు పంచాయితీ పర్మిషన్లు ఇచ్చింది వీళ్ళుకాదా ?

(క్రైమ్ మిర్రర్ – రంగారెడ్డి జిల్లా నిఘా ప్రతినిధి)
కొత్తకుర్మ దంపతుల అక్రమాల పుట్టను తవ్విన కొద్ది ఒకొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ భూమిల పై కన్నేసిన కొత్త కుర్మ దంపతులు… వాటిని రెవిన్యూ అధికారులను మచ్చికగా చేసుకుని కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి విక్రయించి సొమ్ము చేసుకున్న వైనాన్ని క్రైమ్ మిర్రర్ ఇటీవల వెలుగులోకి తెచ్చిన విషయం తెల్సిందే . తాజాగా ఒక మాజీ సైనికునికి భూమిని పథకం ప్రకారం కబ్జా చేశారు. తమ అధికార బలం తో అక్రమ లే ఔట్ వేసి, అమాయకులకు అప్పనంగా అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. లే ఔట్ వేసింది కొత్తకుర్మ శివకుమార్, మంగమ్మ దంపతులైతే… ఈ లే ఔట్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి తుర్కయంజాల్ సర్పంచ్ హోదాలో పర్మిషన్లు ఇచ్చింది కూడా మంగమ్మ శివ కుమారే కావడం విశేషం.

AVD1 - Crime Mirror

కంచె చేను మేసిన చందంగా ఈ దంపతులు సర్వే నెంబర్ 52/5,న్యూ, ఓల్డ్ లో కలిపి 10 ఎకరాలు కబ్జా చేశారు. అయితే ఈ విషయాన్ని మాజీ సైనిక అధికారి సత్తయ్య 2015, సెప్టెంబర్ 18 వ తేదీన హయత్ నగర్ తహశీల్ధార్ కు ఫిర్యాదు చేయగా, తహశీల్ధార్ కొత్తకుర్మ శివకుమార్, మంగమ్మ దంపతులకు షో కాజ్ నోటీసులు జారీ చేశారు. 15 రోజుల వ్యవధిలో.. సర్వే నెంబర్ 52/5, న్యూ, ఓల్డ్ లో కలిపి 10 ఎకరాలు భూమి మీ పేరిట ఎలా బదిలీ అయిందో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. 1977 ఆంధ్ర ప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ చట్టం పరిధిలోని సెక్షన్ 2, 3 ప్రకారం ఈ భూమిని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉన్నదని పేర్కొన్నారు. ఈ భూమి మీకు ఎలా సక్రమించిందో వివరణ ఇవ్వకపోతే, తదుపరి ఈ భూమిని స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు.

form2 copy - Crime Mirror

అయితే ఈ భూమి తమకు ఎలా సక్రమించిందో కొత్తకుర్మ శివకుమార్ , మంగమ్మ దంపతులు ప్రభుత్వానికి వివరణ ఇవ్వకుండానే ఏకంగా లే ఔట్ చేసి ప్లాట్లుగా విభజించి, సదరు మాజీ సైనికాధికారికి ప్రభుత్వం కేటాయించిన భూమిని అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. అయితే ఈ లే ఔట్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రూపాయి… రూపాయి కూడబెట్టి ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇప్పుడు ఆ స్థలం లో ఇల్ల్లు కట్టుకుందామని భావిస్తే, వారిని రెవెన్యూ అధికారులు అడ్డుకుంటున్నారు. ఇది ప్రభుత్వ భూమి అని ఇందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేదని అడ్డుకుంటున్నారు. ఇక అమ్ముకుందామంటే ప్రభుత్వ భూమి అని ఎవరు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. తాము లక్షలాది రూపాయలు పోసి కొనుగోలు చేసిన ప్లాట్లు ప్రభుత్వ భూమిలో ఉన్నాయన్న విషయాన్నీ తెలుసుకోలేక మోసపోయామని బాధితులు వాపోతున్నారు. దీనికంతటికీ తుర్కయంజాల్ మాజీ సర్పంచ్ కొత్తకుర్మ మంగమ్మ, ఆమె భర్త శివకుమారే కారణమని, వారిపై చట్ట రీత్యా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తమని నిలువునా ముంచి రోడ్డున పడేశారని బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.