HyderabadNalgondaRangareddyTelangana

ఇదేమి ప్రెస్ క్లబ్… అంతా వాళ్ల ఇష్టారాజ్యం?

  • ఏడు పత్రికలకే గుర్తింపా… హవ్వ ఇదేమి చోద్యం ??
  • మిగిలిన పత్రికల్లో పని చేసేవారు జర్నలిస్టులు కాదా?
  • ప్రెస్ క్లబ్ అనేది ఏ ఒక్కరి సొంత జాగీర్ కాదు
  • జర్నలిస్టుగా పని చేసే ప్రతి ఒక్కరికీ సభ్యత్వం కల్పించాల్సిందే
  • అలా కాదంటే అసలు దాన్ని ప్రెస్ క్లబ్ అని ఎలా అంటారు
  • ఎవరికి వారే ప్రెస్ క్లబ్ అని చెప్పుకోవడానికి అదేమన్నా పేకాట క్లబా?

నల్లగొండ ప్రతినిధి, జులై 05 క్రైమ్ మిర్రర్; మర్రిగూడ మండలంలో వివిధ తెలుగు దిన పత్రికల్లో పని చేసే వారంతా జర్నలిస్టులే. కానీ కొంతమంది మాత్రం ఒక ముఠాగా ఏర్పడి తాము మాత్రమే జర్నలిస్టుల మని ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఏ పత్రికలో పనిచేసే విలేకరి కి అయినా, ప్రెస్ క్లబ్ లో సభ్యత్వం ఉంటుంది. ఒకవేళ ఆ విలేఖరి ప్రెస్ క్లబ్ సభ్యుడు కాకపోయినప్పటికీ, అతనిపై ఆకాశం ఏమి విరిగి పడదు. ఎందుకంటే… ప్రెస్ క్లబ్లో సభ్యత్వం అన్నది తప్పనిసరి ఏమీ కాదు. ఎందుకంటే కొన్నిచోట్ల ప్రెస్ క్లబ్ లు వివిధ యూనియన్లకు అనుబంధం గా పనిచేస్తూ ఉంటాయి. ఒక యూనియన్ లో పని చేసేవారు, మరొక యూనియన్కు అనుబంధంగా ఉన్న ప్రెస్ క్లబ్ లో చేరడం ఇష్టం లేకపోవచ్చు. అంతమాత్రాన అతనిని జర్నలిస్ట్ కాదనడం మూర్ఖత్వమే అవుతుంది. మరొక విషయం… కేవలం ఏడెనిమిది మంది కలిసి తాము మాత్రమే ప్రెస్ క్లబ్ సభ్యులమని మిగతావారు కాదని ప్రకటించడం ఎంతవరకు సహేతుకమో స్పష్టం చేయాలి. ఎందుకంటే మండల పరిధిలో పనిచేసే ప్రతి ఒక్క జర్నలిస్టుకు ప్రెస్ క్లబ్ సభ్యత్వం ఇచ్చినప్పుడు దానిని ఎవరైనా ప్రెస్ క్లబ్ గా గుర్తిస్తారు కాని ఏడెనిమిది మంది ఒక ముఠాగా ఏర్పడి తమకు తాము ప్రకటించుకునే దాన్ని ప్రెస్ క్లబ్ అనేదానికంటే పేకాట క్లబ్ అంటే బాగుంటుంది. మర్రిగూడ మండల పరిధిలో ఒక జర్నలిస్టు తనకుతానుగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా చెప్పుకుంటూ ఒక ఏడెనిమిది పత్రికలు మాత్రమే తమ క్లబ్ లో సభ్యత్వం ఉన్న వాటి గా ప్రకటించడం సిగ్గుచేటుగా అనిపిస్తోంది.. ఎందుకంటే ఆ జాబితాలో దశాబ్దాలుగా నడుస్తున్న తెలుగు దినపత్రికలు అయినా ఆంధ్రప్రభ, సూర్య, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం వెలువడుతున్న మన తెలంగాణ పత్రికలకు ఈ ప్రెస్ క్లబ్ లో చోటు కల్పించలేదు …అంటే ఈ పత్రికలలో పనిచేసే జర్నలిస్టులు ఆ ఘణత వహించిన అపర మెదవి మహా విలేకరి దృష్టిలో జర్నలిస్టులు కాదని అర్థమా?. ప్రస్తుతం ప్రెస్ క్లబ్ లో సభ్యులుగా ఉన్న పత్రికా విలేకరులు ఏమైనా బంగారు అక్షరాలతో వార్తలు రాస్తారా??, మిగిలిన విలేకరులు సాధారణ అక్షరాలతో వార్తలను రాస్తారా అనేదానికి వారే సమాధానం చెప్పాల్సి ఉంది. అసలు మర్రిగూడ ప్రెస్ క్లబ్ పుట్టుకకు కారణం ఏమిటంటే… తమ ఉనికి ఎక్కడ దెబ్బతింటుందేమోనని భయం ఒక్కటేతే… రేపటి నుండి ఇ తమకు రావాల్సిన ఆమ్యామ్యా లు ఎక్కడ రాకుండా పోతాయనన్న ఆందోళన మరొకటి. ఇటీవల కాలంలో హైదరాబాద్ కేంద్రంగా వెలువడుతున్న క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో వరుసగా వస్తున్న పరిశోధనాత్మక కథనాలు ఈ ప్రెస్ క్లబ్ సభ్యుల గుండెల్లో రైళ్లు పరుగెత్తి స్తున్నాయి. దానితో అందరూ ఏకమై ప్రెస్ క్లబ్ పెరిట.. క్రైమ్ మిర్రర్ దినపత్రిక మర్రిగూడ మండలం విలేకరి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. క్రైమ్ మిర్రర్ అక్షర యజ్ఞం అడ్డుకునే కుతంత్రంలో భాగంగా పురుడు పోసుకున్నదే… ఈ మర్రిగూడ మండల ప్రెస్ క్లబ్ అనే విషయం స్పష్టమవుతోంది. క్రైమ్ మిర్రర్ లో వస్తున్న పరిశోధనాత్మక కథనాల వల్ల తమకు రావాల్సిన నెల మామూళ్ళు రాకుండా పోతాయన్న కంగారుతోనే ఒక ముఠా ఈ ప్రెస్ క్లబ్ పేరిట కొత్త నాటకానికి తెర తీశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా అవినీతి అక్రమాలపై క్రైమ్ మిర్రర్ సంధించే  అక్షర తూటాలను అడ్డుకోలేరు. ప్రజల పక్షాన నిరంతరంగా మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది. నిఘా వ్యవస్థ నిద్రిస్తే… క్రైమ్ మిర్రర్ కాపుకాస్తుంది.

మాకేమీ సంబంధం లేదు…
మర్రిగూడ మండలం ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల అందరికీ సభ్యత్వం ఉంటుందని, అందులో ఎటువంటి సందేహం లేదని ఈనాడు, ఆంధ్ర జ్యోతి విలేకరులు స్పష్టం చేశారు. వాట్సప్ గ్రూప్ లో రిపోర్టర్లు తమ పత్రిక కటింగ్స్ వేసుకోవచ్చు నని, దానికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదన్నారు. అయితే ప్రెస్ క్లబ్ పేరిట వాట్సప్ గ్రూప్ లో ఇతర పత్రిక విలేకరులు రాసిన కటింగ్ లను వేయరాదని చేసిన ప్రకటనతో తమకు ఎటువంటి ప్రమేయం లేదని చెప్పారు.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.