HyderabadRangareddyTelangana

ఆ ఆవులను చంపిన పాపం ఎవరిదీ?

  • నీట మునిగి చనిపోయిన ఆవుల …
  • ఆత్మ ఘోష ఎవరికీ ఎరుక
  • చెరువు లో షెడ్ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చిందెవరు ?
  • మున్సిపల్ హయం లో పంచాయితీ అనుమతులా??
  • నడి చెరువు ఎఫ్ టి ఎల్ పరిధిలోకి రాదా ?
  • అనుమతులిచ్చిన వారికే తెలియాలి …
  • తెలియకుండానే ఎన్ ఓ సి ఎలా ఇచ్చారు ?

క్రైమ్ మిర్రర్ రంగారెడ్డి నిఘా ప్రతినిధి

తుర్కయంజాల్ మాసాబ్ చెరువులో నీట మునిగి దాదాపు 70 ఆవులు చనిపోయిన విషయం అందరూ మర్చిపోయారు. గత ఏడాది ఇదే వర్షాకాలం లో కురిసిన అకాల వర్షాలకు ఎగువ నుంచి వచ్చిన వరద తో మాసాబ్ చెరువు రాత్రికి రాత్రే నిండి పోయింది. చెరువు నిండితే ఊరందరికీ సంబరమే. కానీ గత ఏడాది మాసాబ్ చెరువు నిండడడం, తుర్కయంజాల్ గ్రామ వాసులంతా పెను విషాదంలో నిండిపోయారు. దానికి కారణం లేకపోలేదు. చెరువు నడి మధ్యలో ఒక గో రక్షణ సమితి వారు షెడ్ వేసి గోవులను గుంజలకు కట్టి వేశారు. రోజుకు మాదిరిగా ఆవులను కట్టివేసి వెళ్లిన గో రక్షణ సమితి సభ్యులు, రాత్రికి రాత్రే వరదలో గోవులు కబళిస్తుందని అనుకోలేదు. కానీ అన్ని రోజులు ఒక మాదిరిగా ఉండవు కదా… అకాల భారీ వర్షం కురిసింది. కాలువలు ఉప్పొంగాయి. చెరువు నిండింది. GOSALA - Crime Mirrorనడి చెరువు లో షెడ్ వేసిన వారు బాగానే ఉన్నారు. అనుమతులిచ్చిన వారు హాయిగా నిద్రిస్తుండగానే, చెరువును ముంచెత్తుతున్న వరద నీరు క్షణ, క్షణం పెరుగుతుంటే, ఆ వరద నీరు నుంచి తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలియక ప్రాణభయంతో, ఆ గోమాతలు చేసిన ఆర్తనాదాలు, విఘాత జీవులైన అనంతరం తుర్కయంజాల్ గ్రామస్థులు అర్ధమయింది. అయ్యే … గోమాతలు వరద నీరు చుట్టు ముడుతుంటే ఎంతగా ప్రాణ రక్షణ కోసం అల్లాడిపోయి ఉంటారోనని విఘాత జీవులైన గోవులను చూసి పలువురు మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. మాసాబ్ చెరువు నడి మధ్యలో షెడ్ నిర్మాణానికి అనుమతులిచ్చిన పాపాత్ములు ఎవ్వరంటూ వారంతా తిట్టిపోశారు. GOSALA.jpg 1 - Crime Mirrorకానీ అనుమతులిచ్చిన వారు ఇదేమి పట్టనట్లు తమకు డబ్బులే ముఖ్యం అన్నట్లు వ్యవరించే మనుషులని గ్రామస్థులు గ్రహించలేకపోయారు, చెరువు మధ్యలో షెడ్ నిర్మాణం ఏమిటని మున్సిపల్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా… అనుమతులిచ్చిన ఏలిక లో ఉన్న ఆనాటి మాజీ పెద్దలు, చెరువు మధ్యలోకి వెళ్లి మున్సిపల్ సిబ్బందిని దబాయించి వెనక్కి వెళ్లే విధంగా ఒత్తిళ్లు తెచ్చారు. చెరువు నడి మధ్యలో షెడ్ నిర్మాణాన్ని మున్సిపల్ సిబ్బంది అడ్డుకునేటప్పుడు డబ్బులు తీసుకుని అనుమతులిచ్చిన పెద్దలు పట్టించుకుని ఉండకపోతే, దాదాపు 70 ఆవుల ప్రాణాలు దక్కేవి. డబ్బుల మూటలు తీసుకుని అకారణంగా తమ ప్రాణాలను తీసిన ఆ పెద్దల కుటుంబాలను గోమాతలు ఎంతగా శపించి ఉంటాయో ఆ భగవంతుడికే తెలియాలి.?

avu 12 - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.