

- పంచాయితీ పర్మిషన్లు ఇచ్చే అధికారం నీకు ఎక్కడిది ??
- పంచాయితీ కార్యదర్శి సంతకాలు ఫోర్జరీ చేసిందెవరు ?
- ఆదిత్య నగర్ పేరిట ఏవి నగర్ పర్మిషన్లు ఇచ్చిందెవరు ??
- నిరుపేదల నోళ్లు కొట్టిన పెద్దలు ఎవరు మంగమ్మ ??
- రియల్ దెబ్బకు బలయింది సామాన్యులే కదా మంగమ్మ ?
- ప్రెస్ మీట్ పేరిట నీవు చేసిందేమిటి ?
- హవ్వ … తప్పులు సరిద్దిదుకోకుండా వ్యంగ్యాస్త్రాలా ??
క్రైమ్ మిర్రర్ , రంగా రెడ్డి నిఘా ప్రతినిధి
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు వెనుక మాజీ సర్పంచ్, ప్రస్తుత 21 వ వార్డు కౌన్సిలర్ కొత్త కుర్మ మంగమ్మ ప్రమేయం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఈ మేరకు క్రైమ్ మిర్రర్ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. తాను తుర్కయంజాల్ సర్పంచ్ గా కొనసాగుతున్న సమయంలో పంచాయితీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. పంచాయితీ నుంచి ఇంటి నిర్మాణ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి గ్రామ పంచాయితీ నుంచి కార్యదర్శి పేరిట అనుమతి పత్రాలను జారీ చేయాల్సి ఉండగా, సర్పంచ్ హోదా లోనే మంగమ్మ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి అనుమతి పత్రాలు జారీ చేయడం విస్మయాన్ని కల్గిస్తోంది.
ఇదే విషయాన్నీ ప్రశ్నించిన క్రైమ్ మిర్రర్ దిన పత్రిక గురించి మాజీ సర్పంచ్, ప్రస్తుత కౌన్సిలర్ మంగమ్మ వ్యంగ్యాస్త్రాలు సంధించాలని ఉద్దేశ్యం తో అపహాస్యంగా మాట్లాడడం హాస్యాస్పదంగా అన్పిస్తోంది. ఇది ఆమె స్థాయి కి ఏమాత్రం తగదు. పత్రికలలో వచ్చిన వార్త గురించి తనకు తోక లేదని… తనకు ఎక్కడ వణుకుతుందని ఒక స్థానిక ప్రజా ప్రతినిధి పేర్కొనడం ఎంత వరకు సబబు అన్నది ఆమె ఆలోచించుకోవాలి. ఎక్కడ తీగ లాగితే … ఎక్కడ డొంక కదిలిందని ఒక విలేఖరిని ఆమె ప్రశ్నించడం చూస్తే తాను ఎంతటి అసహనం ఉందో ఇట్టే అర్ధం అవుతోంది. మంగమ్మ ఏమి తప్పు చేయకపోతే తుర్కయంజాల్ మాజీ పంచాయితీ కార్యదర్శి తేజ్ సింగ్, సస్పెండ్ అయిన బిల్ కలెక్టర్ యాదయ్య లను కూడా ఎందుకు ప్రెస్ మీట్ కు పిలిపించలేదన్న ప్రశ్నకు సమాధానం లేకుండా పోయింది. ఈ ప్రశ్నలకు మాజీ సర్పంచ్ మంగమ్మ సమాధానం చెబితే … క్రైమ్ మిర్రర్ తాను రాసిన అన్ని వార్తలను ఆధారాలతో సహా చర్చకు ఎప్పుడైనా… ఎక్కడైనా సిద్ధమేనని ప్రకటిస్తుంది.
(నిఘా వ్యవస్థ నిద్రిస్తే.. క్రైమ్ మిర్రర్ కాపుకాస్తుంది…. రేపటి సంచిక లో మాసాబ్ చెరువు లో మునిగిన చనిపోయిన ఆవుల ఆత్మఘోష … దానికి పర్మిషన్ ఇచ్చిందెవరు ? అన్న విషయాన్నీ ఆధారాలతో సహా ప్రచురిస్తాం ….)
saWEOxwtXIMJU