RangareddyTelangana

తుర్క‌యంజాల్ మాజీ స‌ర్పంచ్‌, ప్ర‌స్తుత కౌన్సిల‌ర్ అవినీతి నిజ‌మే

  • సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన బిల్ క‌లెక్ట‌ర్ యాద‌య్య‌
  • శోభాన‌గ‌ర్‌, ఆదిత్య‌న‌గ‌ర్‌లో ప‌ర్మిష‌న్ ఫీజుకు అద‌నంగా రూ.10వేలు వ‌సూలు
  • అప్ప‌టి స‌ర్పంచ్‌, సెక్ర‌ట‌రీ చెబితేనే నేను ర‌శీదులు ఇచ్చా
  • తుర్క‌యంజాల్‌లో ప‌రిధిలో అప్ప‌ట్లో సుమారు రూ.6కోట్ల అవినీతి
  • విచార‌ణ‌లో అన్ని విష‌యాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా: యాద‌య్య‌

రంగారెడ్డి నిఘా ప్రతినిధి, క్రైమ్ మిర్రర్: తుర్క‌యంజాల్ గ్రామ పంచాయ‌తీగా ఉన్న‌ప్పుడే ఆ మాజీ స‌ర్పంచ్‌, ప్ర‌స్తుత కౌన్సిల‌ర్ అవినీతికి బీజం ప‌డిన‌ట్లు తేట‌తెల్ల‌మైపోయింది. అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డి స‌ర్పంచ్ ప‌దవి నుంచి స‌స్పెండైనా.. తీరు మార్చుకోకుండా అదే దందాను కొన‌సాగించిన‌ట్లు నిరూపించే సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. డ‌బ్బు సంపాద‌న‌లో మాజీ స‌ర్పంచ్‌కి ప్ర‌ధాన ఆయుధంగా ఉప‌యోగ‌ప‌డిన బిల్ క‌లెక్ట‌ర్ యాద‌య్య అన్ని ర‌హ‌స్యాలు బ‌ట్ట‌బ‌య‌లు చేశారు.

తుర్క‌యంజాల్‌లో ప్ర‌స్తుత అవినీతి బాగోతాల పునాది పంచాయ‌తీగా ఉన్న‌ప్పుడే ప‌డిన‌ట్లు తెలుస్తోంది. అప్ప‌టి స‌ర్పంచ్‌, ప్ర‌స్తుత కౌన్సిల‌ర్ అందిన‌కాడికి దోచుకునే విధంగా వ్య‌వ‌హ‌రించేవారని, కింది స్థాయి ఉద్యోగుల‌ను అడ్డుపెట్టుకొని ఎలా సంపాదించాలో అనాటి నుంచే గుర్తెరిగిన‌ట్లు తెలుస్తోంది. అప్ప‌టి ర‌హ‌స్యాల‌న్నీ ఒక్కొక్క‌టిగా బ‌య‌ట ప‌డుతుండ‌టంతో స‌ద‌రు కౌన్సిల‌ర్ వెన్నులో వ‌ణుకుమొద‌లైన‌ట్టు గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టికే ఓ సారి స‌స్పెండై అబాసుపాలైన ఆ ప్ర‌జాప్ర‌తినిధి, మ‌ళ్లీ అలాంటి ప‌రిస్థితులే ఎదుర‌వుతుండ‌టంతో మొహం ఎక్క‌డ పెట్టుకోవాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ట్టు స్థానికుల్లో చ‌ర్చ మొద‌లైంది.

వాస్త‌వాలు ఇలా ఉన్నాయి.. తుర్క‌యంజాల్ గ్రామ పంచాయ‌తీకి చివ‌రి స‌ర్పంచ్‌గా ప‌నిచేసిన ప్ర‌స్తుత కౌన్సిల‌ర్‌… రియ‌ల్ ఎస్టేట్ ఓ ఊపు ఊపుతుండ‌టం, న‌గ‌రానికి ద‌గ్గ‌ర్లో ఉండ‌టంతో ఇక్క‌డ ఆవాసం ఏర్ప‌రుచుకునేందుకు రాజ‌ధాని వాసులు త‌ర‌లిరావ‌డం మొద‌లైంది. శోభాన‌గ‌ర్‌, ఆదిత్య‌న‌గ‌ర్‌, ఏవీన‌గ‌ర్‌, క‌మ్మ‌గూడ‌లోని కొన్ని ప్రాంతాల్లోని లిటిగేష‌న్ స‌ర్వే నెంబ‌ర్ల‌ని తెలియ‌క‌, త‌క్కువ రేటులో వ‌స్తుండ‌టంతో ప్లాట్లు తీసుకుని, ఇళ్లు క‌ట్టుకునేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. ఇదే అదునుగా భావించిన అప్ప‌టి స‌ర్పంచ్ దొంగ, న‌కిలీ ప‌ర్మిష‌న్లు ఇచ్చిన‌ట్లు అప్ప‌టి బిల్ క‌లెక్ట‌ర్ యాద‌య్య ఒప్పుకున్నాడు. ఆదిత్య‌న‌గ‌ర్ కాల‌నీ ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఉండ‌టంతో ఏవీన‌గ‌ర్ పేరుతో ర‌శీదులు ఇచ్చామ‌న్నారు. ఒక్కో ఇంటికి ప‌ర్మిష‌న్ ఖ‌రీదుతో పాటు రూ.10వేలు అద‌నంగా వ‌సూలు చేసిన‌ట్లు చెప్పారు. ఇదంతా అప్ప‌టి సెక్ర‌ట‌రీ, స‌ర్పంచ్ క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగింద‌ని, వారు చెబితేనే ర‌శీదులు రాసిన‌ట్లు తెలిపారు. అప్ప‌ట్లో కొన్ని వంద‌ల ఇళ్ల‌కు ప‌ర్మిష‌న్లు ఇచ్చిన‌ట్లు, కోట్ల‌లో ఆదాయం వ‌చ్చిన‌ట్లు దీన్ని బ‌ట్టి అవ‌గ‌త‌మైతోంది.

అప్ప‌టి ర‌శీదు కాపీలు, స్టాంప్‌లు, డిజిట‌ల్ సంత‌కాలతో మున్సిపాలిటీ ఏర్ప‌డిన త‌ర్వాత కూడా దందా కొన‌సాగించిన‌ట్లు చెప్పుకుంటున్నారు. దీనికి యాద‌య్య పూర్తి స‌హ‌కారం అందించిన‌ట్లు తేట‌తెల్లం అవ‌డంతో అత‌న్ని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ స‌స్పెండ్ చేశారు. శోభాన‌గ‌ర్‌, ఆదిత్య‌న‌గ‌ర్ ప్రాంతాల్లో వంద‌ల సంఖ్య‌లో న‌కిలీ గ్రామ పంచాయ‌తీ ప‌ర్మిష‌న్లు ఇచ్చిన‌ట్లు క‌మిష‌న‌ర్ గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి పూర్తి ఆధారాలు సేక‌రించి, త‌ప్పు చేశాన‌ని ఒప్పుకున్నాకే యాద‌య్య‌పై వేటు వేసిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌ విధులు నిర్వ‌ర్తించిన రాగ‌న్న‌గూడ‌లోని సిటిజ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్‌లో భారీగా న‌కిలీ పర్మిష‌న్ ప‌త్రాలు దొర‌క‌డంతో దాన్ని సీజ్ చేసిన‌ట్లు చెప్పుకుంటున్నారు. ఇన్నాళ్లు త‌న సంత‌కం ఫోర్జ‌రీ చేశార‌ని, న‌కిలీ ప‌ర్మిష‌న్ల‌పై ఉన్న‌ది త‌న సిగ్నేచ‌రే కాద‌ని చెప్పుకుంటూ వ‌స్తున్న అప్ప‌టి స‌ర్పంచ్ ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి. త‌న సంత‌కం ఫోర్జ‌రీ అయితే… నిందితుల‌ను గుర్తించి, పూర్తిస్థాయి విచార‌ణ జ‌ర‌పాల‌ని పోలీసుల‌కు ఎందుకు ఫిర్యాదు చేయ‌లేద‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఒక‌సారి స‌స్పెండై ప‌రువు తీసుకున్న మాజీ స‌ర్పంచ్‌… ఇప్పుడు కౌన్సిల‌ర్‌గా ఉండి మ‌రోసారి అదే వేటుకు గుర‌య్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని జ‌నాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఏం జ‌రుగుతుందో. మ‌న‌మూ వేచి చూద్దాం.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.