
హైదరాబాద్,క్రైమ్ మిర్రర్ : ప్రేమించిన వ్యక్తి దక్కలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమండ్ల గ్రామానికి చెందిన కర్నాల శ్రీకాంత్ చదువుకుంటున్నాడు. అతను అదే గ్రామంలోనే ఓ యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. యువతి తల్లిదండ్రులకు విషయం తెలియగా యువకుడిని మందలించారు. తమ కూతురి జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. విషయం యువకుడి తల్లిదండ్రులకు కూడా తెలియడంతో రెండు నెలల క్రితమే అతన్ని తన మేనత్త ఊరు అయిన సిద్దాపూర్కు పంపించారు. కానీ అక్కడ కూడా యువకుడు ఆ యువతిగురించే ఆలోచించసాగాడు. ఆమె దూరమవుతుందనే బాధతో మనస్తాపం చెంది ఊరి బయటకు వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. గమనించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..