RangareddyTelangana

తుర్క‌యంజాల్‌లో కాంగ్రెస్ కౌన్సిల‌ర్ల ఇష్టారాజ్యం

  • తుర్క‌యంజాల్‌లో కాంగ్రెస్ కౌన్సిల‌ర్ల ఇష్టారాజ్యం
  • దొంగ‌, పాత ప‌ర్మిష‌న్ల‌తో అక్రమ నిర్మాణాల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు
  • 21వ వార్డు కౌన్సిల‌ర్‌, ఆమె భ‌ర్త‌ క‌నుసైగ‌ల్లో అక్ర‌మ నిర్మాణాలు
  • మున్సిప‌ల్ అధికారులు సీజ్ చేసిన నిర్మాణాల్లోనూ య‌థేచ్ఛ‌గా ప‌నులు
  • ప‌ట్టించుకోని టౌన్ ప్లానింగ్, మున్సిప‌ల్ అధికారులు

రంగారెడ్డి నిఘా ప్రతినిధి, క్రైమ్ మిర్రర్: తుర్క‌యంజాల్‌లో కొంద‌రు కౌన్సిల‌ర్ల ప‌నితీరు, వారి వ్య‌వ‌హారశైలితో మున్సిపాలిటీ ప‌రువు తీసేలా క‌న‌బ‌డుతోంది. అక్ర‌మ నిర్మాణాల‌ను ప్రోత్స‌హిస్తూ, అక్ర‌మార్కుల‌కు అండ‌దండ‌లందిస్తూ వారికి మ‌రింత ఊతం ఇచ్చేలా కౌన్సిల‌ర్ల ప్ర‌వ‌ర్త‌న క‌న‌బ‌డుతోంది. దొంగ ప‌ర్మిష‌న్లు, కాలంచెల్లిన ప‌ర్మిష‌న్లపై సంత‌కాలు చేస్తూ మున్సిపాలిటీ ప‌రువును బ‌జారుకీడుస్తున్నారు. మున్సిప‌ల్‌, టౌన్ ప్లానింగ్ అధికారులు చూసీచూడ‌న‌ల్లు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో వీరిది ఇష్టారాజ్యంగా మారింది.

తుర్క‌యంజాల్ పుర‌పాల‌కం ప‌రిధిలో ఎక్కువ‌గా నిర్మాణాలు జ‌రుగుతున్న వార్డు 21వ వార్డు. సాగ‌ర్ ర‌హ‌దారికి ఆనుకుని ఉండ‌టం, శ్రీ‌రాంన‌గ‌ర్ కాల‌నీ వంటి రిచ్ లుక్ క‌లిగిన‌ ప్రాంతం వ‌ల్ల ఈ వార్డులో ఇళ్లు నిర్మించుకోవ‌డానికి ఎక్కువ మంది ఆస‌క్తి చూపుతుంటారు. ఇదే అదునుగా భావించిన స్థానిక కౌన్సిల‌ర్‌, ఆమె భ‌ర్త నిర్మాణదారుల వ‌ద్ద ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు దండుకుంటున్నార‌న్న ఆరోప‌ణ‌లు గుప్పుమంటున్నాయి. రాజ‌స్థాన్‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల నుంచి వ‌చ్చి ఇక్క‌డ స్థిర‌ప‌డిన వ్యాపారులు కొంద‌రు క‌మ‌ర్షియ‌ల్ భ‌వ‌నాలు నిర్మిస్తుండ‌టంతో అంతా మేమే మేనేజ్ చేస్తామంటూ కౌన్సిల‌ర్ వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

సాగ‌ర్ మెయిన్ రోడ్డు నుంచి తుర్క‌యంజాల్ మున్సిప‌ల్ ఆఫీసుకు వెళ్లే రోడ్డులో ఓ రాజ‌స్థాన్ వ్యాపారి రెండు అంత‌స్థుల‌కు వేసుకోవడానికి మున్సిప‌ల్ ప‌ర్మిష‌న్ తీసుకొని, స్థానిక కౌన్సిల‌ర్ ప్రోద్బ‌లంతో అక్ర‌మంగా మూడో ఫ్లోర్‌, పెంట్ హౌస్ నిర్మిస్తున్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆ నిర్మాణ‌దారుడి వ‌ద్ద కౌన్సిల‌ర్‌, ఆమె భ‌ర్త భారీగా వ‌సూలు చేసిన‌ట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. కింద క‌మ‌ర్షియ‌ల్‌, పైన రెండు ప‌ర్మిష‌న్‌లేని నిర్మాణాలు కాబ‌ట్టి మున్సిపాలిటీ ప‌రిధిలో ఎక్కువ‌ మందిని మేనేజ్ చేయాల్సి ఉంటుంద‌ని ఆ వ్యాపారి ద‌గ్గ‌ర ల‌క్ష‌ల్లో వ‌సూలు చేసిన‌ట్లు చెప్పుకుంటున్నారు. ఆ వ్యాపారికి స్థానిక ప‌రిస్థితులు అంత‌గా తెలియ‌క‌పోవ‌డంతో కౌన్సిల‌ర్ అడిగిందే త‌డవుగా భారీగా పైకం ముట్ట‌జెప్పిన‌ట్టు తెలుస్తోంది. కౌన్సిల‌ర్, ఆమె భ‌ర్త టీపీసీసీ కార్య‌ద‌ర్శి మేనేజ్ చేయాల్సిన వ్య‌క్తుల‌ను ఇంటికి పిలిపించుకుని మ‌రీ ఎంతోకొంత ఇచ్చి పంపిస్తున్నార‌న్న వార్తలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

అలాగే బ్యాంక్ ఆఫ్ బ‌రోడా బిల్డింగ్ ప‌క్క‌న నిర్మిస్తున్న మ‌రో భ‌వ‌నాన్ని పాత పంచాయ‌తీ ప‌ర్మిష‌న్లు ఇచ్చి ఇదే కౌన్సిల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ బిల్డింగ్‌గా తీర్చిదిద్దేందుకు స‌హ‌క‌రిస్తున్నార‌న్న విష‌యం బ‌య‌ట‌కు పొక్కింది. రెండేళ్ల క్రితం కొంద‌ర్ని మేనేజ్ చేసినా… ప్ర‌స్తుత క‌మిష‌న‌ర్ అది అక్ర‌మ నిర్మాణ‌మంటూ సీజ్ చేశారు. భ‌వ‌నం సీజ్ చేసిన ప‌ది రోజుల‌కే ఆ బ్యాన‌ర్‌ను తొల‌గించి య‌థేచ్ఛ‌గా ప‌నులు చేప‌ట్టారు. పాత భ‌వ‌న ప‌ర్మిష‌న్ చూపి, కింద సెల్లార్‌తో పాటు మ‌రో మూడు అంత‌స్థులు పైకి క‌మ‌ర్షియ‌ల్ భ‌వ‌నంగా తీర్చిదిద్దేందుకు స‌దరు కౌన్సిల‌ర్ ఆ ఓన‌ర్‌ని ప్రోత్స‌హిస్తున్న‌ట్లు చెప్పుకుంటున్నారు. దీనికి కార‌ణం కౌన్సిల‌ర్‌కు ఆ భ‌వ‌న య‌జ‌మాని భారీగా చేయి త‌డిపిన‌ట్టు చెప్పుకుంటున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే 21వ వార్డు ప‌రిధిలో అనుమ‌తిలేకుండా నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లు, భ‌వ‌నాల సంఖ్య లెక్క‌లేన‌న్ని ఉన్నాయ‌ని కౌన్సిల‌ర్‌, ఆమె భ‌ర్త ద‌గ్గ‌రుండి అన్ని వ్య‌వ‌హారాలు న‌డిపిస్తుండ‌టంతో అక్ర‌మార్కులు య‌థేచ్ఛ‌గా నిర్మాణాలు సాగిస్తున్న‌ట్లు చెప్పుకుంటున్నారు. స‌ద‌రు కౌన్సిల‌ర్ గ‌తంలో స‌ర్పంచ్‌గా చేసినందున అప్ప‌టి ప‌ర్మిష‌న్లు ఇస్తూ అక్ర‌మార్కుల‌ను ప్రోత్స‌హించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.
నిబంధ‌న‌లను తుంగ‌లో తొక్కుతూ, విచ్చ‌ల‌విడిగా అక్ర‌మ నిర్మాణాలు చేప‌డుతూ మున్సిప‌ల్‌, ప్ర‌భుత్వ ఆదాయానికి గండికొడుతున్నా మున్సిపాలిటీ అధికారులు మిన్న‌కుండ‌టం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఇప్ప‌టికైనా మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌, ఇత‌ర అధికారులు చొర‌వ తీసుకుని అక్రమార్కుల ప‌ట్ల కొర‌డాఝులిపించాల‌ని కోరుతున్నారు. అలాగే అక్ర‌మార్కుల‌ను ప్రోత్స‌హిస్తూ, అమ్యమ్యాల‌కు ఆశ‌ప‌డి మున్సిపాలిటీ ప‌రువు తీసేలా వ్య‌వ‌హ‌రిస్తున్న కౌన్సిల‌ర్ల ప‌ట్ల చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.