HyderabadRangareddyTelangana

తుర్క‌యంజాల్‌లో వెలుగులోకి వ‌స్తోన్న కౌన్సిల‌ర్‌ అక్ర‌మ బాగోతాలు

నిర్మాణదారుల నుంచి వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్నార‌ని కౌన్సిల‌ర్‌పై ఆరోప‌ణ‌లు
గ‌తంలో ఓ వెంచ‌ర్ కోసం 30 ఫీట్ల రోడ్డు తీసేందుకు కౌన్సిల‌ర్, ఆమె భ‌ర్త‌ య‌త్నం
త‌న సామాజిక‌వ‌ర్గ వ్య‌క్తి వెంచ‌ర్ కోసమే కౌన్సిల‌ర్ తాప‌త్ర‌య‌ప‌డుతున్నార‌ని గుస‌గుస‌లు

రంగారెడ్డి నిఘా ప్రతినిధి, క్రైమ్ మిర్రర్: తుర్క‌యంజాల్ మున్సిపాలిటీ ప‌రిధిలో అక్ర‌మాలు, సెటిల్‌మెంట్ల జోరు కొన‌సాగుతూనే ఉంది. సాగ‌ర్ ర‌హ‌దారికి ఆనుకుని ఉన్న వార్డుల్లో భారీ నిర్మాణాలు చేప‌డుతున్న బిల్డ‌ర్లు, య‌జ‌మానుల ద‌గ్గ‌ర కౌన్సిల‌ర్లు బ‌హిరంగంగా వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతూ జ‌నాల‌కు చిక్కిపోతున్నారు. తాజాగా 21వ వార్డు ప‌రిధిలో అనుమ‌తిలేకుండా అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు, ప‌ర్మిష‌న్ లేకుండా పాత ఇళ్ల‌ను ఎక్స్‌టెండ్ చేస్తున్న ఇళ్ల య‌జ‌మానుల ద‌గ్గ‌ర ఓ కౌన్సిల‌ర్ భారీగా వ‌సూలు చేశార‌న్న ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న్నాయి. అక్ర‌మాల‌ను ప్ర‌శ్నించిన‌వారి చేయి త‌డుపుతూ వారి ద‌రిదాపుల్లోకి రాకుండా వ్య‌వ‌హారాలు చ‌క్క‌దిద్దుకుంటున్నార‌న్న ఆరోప‌ణ‌లు విన్పిస్తున్నాయి. క‌మ‌ర్షియ‌ల్ భ‌వ‌నాల నిర్మాణదారుల వ‌ద్ద ఇంకా పెద్ద మొత్తంలో వ‌సూలు చేశార‌ని తెలుస్తోంది. విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌కుండా ఎక్క‌డిక‌క్క‌డ జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ స్థాయిని బ‌ట్టి పైకం ముట్ట‌జెప్పుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు విన్పిస్తున్నాయి.

అదేవార్డు ప‌రిధి ల‌క్ష్మీగార్డెన్ న‌గ‌ర్ కాల‌నీలో భూబాధితుల‌కు, కౌన్సిల‌ర్‌కు జ‌రిగిన వార్ మ‌రింత ముదిరే అవ‌కాశం క‌న్పిస్తోంది. స‌ర్వే నెంబ‌ర్ 193, 194, 195, 196లోని వెల‌సిన లే అవుట్ల‌లోని ఇళ్ల‌కు గ‌తంలో అక్ర‌మ ప‌ర్మిష‌న్లు ఇచ్చి, ఇప్పుడు వాటికి 30 ఫీట్ల రోడ్డును తీసేందుకు య‌త్నిస్తున్నార‌ని భూబాధితులు గ‌గ్గోలు పెడుతున్నారు. వెంచ‌ర్ల‌లోని ఇళ్ల య‌జ‌మానుల ద‌గ్గ‌ర భారీగా లంచాలు తీసుకొని స‌ర్వే నెంబ‌ర్ 168లోని త‌మ భూమిలో నుంచి రోడ్డును తీసేందుకు కౌన్సిల‌ర్ య‌త్నిస్తున్నారంటూ బాధితులు ఆందోళ‌న‌చెందుతున్నారు. రోడ్లు వేసేందుకు వెంచ‌ర్ చేసిన‌వారికి లేని ఆత్రుత కౌన్సిల‌ర్‌కు ఎందుకని వారు ప్ర‌శ్నిస్తున్నారు. త‌మ భూమిలో నుంచి ఫీట్ కూడా జ‌ర‌గ‌బోమ‌ని, 30 ఫీట్ల రోడ్డు ఇచ్చేదే లేదని కౌన్సిల‌ర్‌పై తిరుగుబాటు చేసేందుకు స‌మాయ‌త్తం అవుతున్నారు. గ్రామ న‌క్ష‌లో డొంక రోడ్డుగా ఉంద‌ని, దాన్ని 30 ఫీట్ల రోడ్డుగా విస్త‌రిస్తే త‌మ భూములు కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 25 ఫీట్ల వ‌ర‌కు రోడ్డు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని, కానీ కౌన్సిల‌ర్ ఓ వెంచ‌ర్ కోసం 30 ఫీట్ల రోడ్డు కావాల్సింద‌నేని ప‌ట్టుబ‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

WhatsApp Image 2021 06 24 at 8.43.05 PM - Crime Mirror

త‌న సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఓ వ్య‌క్తి గ‌తంలో చేసిన వెంచ‌ర్‌కు 30 ఫీట్ల రోడ్డును బ‌హుమ‌తిగా ఇచ్చి, త‌ను ల‌బ్దిపొందేందుకు కౌన్సిల‌ర్‌, ఆమె భ‌ర్త తాత‌ప‌త్ర‌య‌ప‌డుతున్నార‌ని స్థానికులు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా స‌ర్వే నెంబర్ 193, 194, 195, 196లో వెల‌సిన 20-30 ఇళ్ల య‌జ‌మానుల ద‌గ్గ‌ర రోడ్డుపేరుతో కౌన్సిల‌ర్ భారీగా వ‌సూళ్ల‌కు పాల్ప‌డ్డార‌ని, వారు ఇప్పుడు ప్ర‌శ్నిస్తుండ‌టంతో కౌన్సిల‌ర్‌, ఆమె భర్త దౌర్జ‌న్యంగా మా భూమిలోనుంచి రోడ్డు తీసేందుకు య‌త్నిస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు. ఈ విష‌యంపై బాధితులు స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌ను, అధికారుల‌ను క‌లిసి గోడు వెళ్ల‌బోసుకున్నట్లు చెబుతున్నారు. అధికారులంతా 25 ఫీట్ల రోడ్డు వేసేందుకు సుముఖంగా ఉన్నా, కౌన్సిల‌ర్ భ‌ర్త టీపీసీసీ ప‌ద‌విని అడ్డుపెట్టుకొని రాజ‌కీయాలు చేస్తూ… 30 ఫీట్ల రోడ్డు కావాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నార‌ని అంటున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో త‌మ భూమిలోనుంచి ఫీటు జాగా కూడా వ‌ద‌ల‌బోమ‌ని, ప్రాణ‌త్యాగానికైనా మేం సిద్ధ‌మంటూ… కౌన్సిల‌ర్‌పై తిరుగుబాటుకు వారు సిద్ధ‌మ‌వుతున్నారు.

WhatsApp Image 2021 06 24 at 8.42.41 PM - Crime Mirror

నాతి అంజ‌య్య‌గౌడ్‌, తుర్క‌యంజాల్‌
స‌ర్వే నెంబ‌ర్ 168లోని ఐదెక‌రాల భూమిని మా తాతల కాలం నుంచి సాగు చేసుకుంటూ బ‌తుకుతున్నాం. ఈ భూమే మాకు జీవ‌నాధారం. కొంద‌రు అక్ర‌మార్కులు, స్థానిక కౌన్సిల‌ర్ మా భూమిపై క‌న్నేసి మాకు నిద్ర‌లేని రాత్రుల‌ను మిగిల్చుతున్నారు. ఎవ‌రి వెంచ‌ర్‌కో మా భూమిని ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. పాత గ్రామ పంచాయ‌తీ ప‌ర్మిష‌న్లు ఇచ్చి అక్ర‌మార్జ‌న పొంది, ఇప్పుడు వాటిని క‌ప్పి పుచ్చుకునేందుకు రోడ్డుపేరుతో నాట‌కాలు ఆడుతున్నారు.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

5 Comments

 1. This is false news.. It would be great if press talks to locals.. This is funded news.
  We are residents of this colony and reporters taking money from land grabbers and published wrong news.
  Crime mirror management should do enquiry and take action on these reporters else it will losse it’s credibility.

 2. Funded news..This paper dono facts..Did not talk to local residents on problems faced because of encroaches.our counselor is working hard to resolve problems faced by we residents

 3. Sir,
  Without knowing the facts how you posted the article.
  Did you check all the details?
  It is a colony problem. Did you verified the colony map. No basic amenities available due to this road problem.
  Have you done any survey before judging a person.
  Police complaints have been launged due to this colony problem.
  I don’t think this is a Valid News paper for referring the NEWS..
  I DONT THINK THIS NEWS PAPER WON’T LAST FOR LONG TIME.
  TRY TO SOLVE THE SOCIETY ISSUES RATHER DIVERTING.

 4. This is wrong news.. Reporters did not talk to locals.. Residents suffering because of encroached roads.councillor doing her responsibility without taking money.. Please talk to residents before publishing news.

 5. This is to bring it to your kind NOTICE, that i resident of Sriram Nagar Colony, Thurka Yamjal. Truly disaggree the above mentioned Story / Matter.
  Matter mentioned / printed was stating as One sided information, well there is no truth in the story mentioned. Prior taking a valid information how can a REPORTER just give it to PUBLISH & how carelessly a concern person AUTHORIZE the same! for PUBLICATION!

  As mentioned that Councillor taking Bribes bla.. bla.. We residents of this Area / Place we had never paid a Sigle PENY to the concern COUNCILLOR & no Illegal permission being Entertained.
  We as a common people have a respect on JOURNALISM & JOURNALISTS, REPORTERS but reading such DRAMATIC STORY / MATTER we felt that in such a way FALSE NEWZ being Published.

  Request you to look in to this matter & beware your reporter before giving such information for Publishing.

Leave a Reply

Your email address will not be published.

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.