
మర్రిగూడ జూన్ 12(క్రైమ్ మిర్రర్) మర్రిగూడ మండలంలో శుక్రవారం భాధ్యతలు చెప్పట్టిన నాగుల్ మీరా శనివారం మండల కేంద్రంలో లాక్డౌన్ అతిక్రమించి రోడ్లపై యద్ధేచ్చగా తిరుగుతున్న వాహన దారులపై కొరడా జులిపించారు.నిభంధనలకు విరుద్ధంగా బయట తిరుగుతున్న వాహనాలను నిలిపి ప్రశ్నించారు. ప్రజా ప్రయోజనాలార్థం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిభంధనలకు అతిక్రమిస్తున్న వాహనాలను సీజ్ చేస్తూ, జరిమానాలు విధిస్తున్నారు. నిభంధనలను పాటించని వారెవరైనా సరే ఉపేక్షించేది లేదన్నారు.కొంత మంది వ్యక్తులు రాజకీయ నాయకులకు ఫోన్ చేసి మభ్యపెడుదామని చూసినా వాటిని తిరస్కరించారు. ప్రతి ఒక్కరూ చట్టపరంగా వ్యవహరించాలని అన్నారు. సామాన్యులు సైతం లాక్ డౌన్ పాటించాల్సిందే అన్నారు.కరోనా మహమ్మారిని జయించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.