
అక్రమ నిర్మాణాలు, వెంచర్లకు సహకరించిన
స్రవంతిని తీసుకురావడంలో మర్మం ఏంటి..
ఏడాది కాలంగా యంజాల్ మున్సిపల్ ప్లానర్
మెడలు వంచిన కమీషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి..
పాత ఫైల్ ల బూజు దులిపే పనిలో ప్లానర్..
డిజిటల్ కి రాగానే అన్ని చక్క పెట్టుకునేందుకు ప్లాన్..
అరోపణలు ఎదుర్కొంటున్న అధికారి వద్దంటున్న స్థానికులు..
క్రైమ్ మిర్రర్,నిఘా ప్రతినిధి: తుర్కయంజాల్ రియల్ మాఫీయా, రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తనందకు, అక్రమ నిర్మాణాల పట్ల మున్సిపల్ కమిషనర్ అహ్మద్ సఫీ ఉల్లాతో కలిసి కఠినంగా వ్యవహరించడం, అంతా తానే అని చెప్పుకుంటూ తాను ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా నిర్మాణ అనుమతులు ఇప్పించేటువంటి మున్సిపాలిటీ ప్లానర్ మెడలు వంచడమే ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న ఉమా బదిలీకి కారణమా.. వీరి అక్రమాలు తిరిగి యధేచ్చగా కొనసాగాలి అంటే గతంలో ఇక్కడే పనిచేసి రియల్ మాఫీయా.. ఓ ప్లానర్ తానా అంటే తందానా అన్నటువంటి అధికారిని తీసుకురావడం వెనక పెద్ద స్టోరీనే నడిచిందా అంటే అవుననే అంటున్నారు పలువురు రాజకీయ, సామాజిక విశ్లేషకులు, గతంలో ఇక్కడే పనిచేసి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి ఇక్కడ పోస్టింగ్ ఇవ్వకూడదని పలువురు స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే పీఏ సహకారంతో……
ఉమ తన మాట విననందుకే బదిలీ చేయించానని పుల్ గా సహకరించే స్రవంతిని ఇక్కడకు తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని డప్పు కొట్టి మరి చెప్పుకుంటున్నాడు మున్సిపాలిటీ ప్లానర్. ఎమ్మెల్యే పీఏ శ్రీనివాసు ను అడ్డుపెట్టుకుని టౌన్‌ప్లానింగ్ అధికారి ఉమాపై ఎమ్మెల్యేకు తప్పుడు సమాచారం ఇప్పించడం లోను ప్లానరే కీలకంగా వ్యవహరించారని సమాచారం. పీఏ శ్రీనివాస్ పేరు చెప్పుకునే ఈ ప్లానర్ అనేక అక్రమ నిర్మాణాలు సజావుగా సాగేలా చూసుకుంటాడాని టాక్.. ఇక మీదట మున్సిపాలిటీ కి వచ్చే అధికారులు తన మాట వినక పోతే వారికి కూడా ఇదే గతి పట్టేలా చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడని తెలుస్తుంది. విషయం ఏంటి అంటే ఉమా పని ఒత్తిడి కారణంగా ఒక్కోసారి నాయకుల ఫోన్ లు లిఫ్ట్ చేయకపోవడం, ఫైళ్లను సకాలంలో క్లియర్ చేయకపోవడం వంటి ఆరోపణలు కొన్ని ఉన్నాయి. దీనికి తోడు ఇటీవల మున్సిపల్ సమావేశానికి ఎమ్మెల్యే హాజరు అయినా ఉమా రాకపోవడం కూడా ఆమెకు మైనస్ పాయింట్.. ఇలాంటి కారణాలతో ఎమ్మెల్యే పక్కకు తప్పించాడు అనే వాదన ఉంది.. కానీ ప్లానర్ మాత్రం క్రెడిట్ తనకే దక్కితే చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవాలని చూస్తున్నాడు..
బూజు దులిపే పనిలో నిమగ్నం..
తమ ఆగడాలకు ఎలాంటి అడ్డు చెప్పని అధికారిని తీసుకువచ్చి సీటులో కూర్చుండబెట్టారు కాబట్టి ఏడాది కాలంగా పెండింగ్ లో ఉండి బూజు పట్టిన ఫైళ్ల దుమ్ము దులిపే పనిలో మున్సిపాలిటీ ప్లానర్ తో పాటు, రియల్ మాఫీయా నిమగ్నం అయినట్లు సమాచారం. టౌన్‌ప్లానింగ్ అధికారికి రేపో, మాపో డిజిటల్ కి రాగానే అన్ని క్లియర్ చేసేలా ముందే మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఒప్పందంలో భాగంగానే ఆమెను ఇక్కడికి తీసుకువచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అక్రమ వెంచర్లు, నిర్మాణాలకు పుల్ సపోర్ట్..
గతంలో ఇక్కడే పనిచేసి పోయి.. తిరిగి ఇదే స్థానానికి వచ్చిన స్రవంతి అక్రమ వెంచర్లు.. అక్రమ నిర్మాణాలకు వెన్నుదన్నుగా నిలిచారని పలువురు స్థానికుల అభిప్రాయం. ఆమె ఇక్కడ పనిచేస్తున్న సమయంలో ఇంజాపూర్ లోని ప్రభుత్వ సర్వే నెంబర్లు అయినటువంటి 203, 225, 220 లోని భూమిని కబ్దా చేసి పలువురు వెంచర్ చేసిన చర్యలు తీసుకోకపోగా, కొన్ని ప్లాట్లకు అప్పటి కమీషనర్ సురేందర్ రెడ్డి, మున్సిపాలిటీ ప్లానర్ తో కలిసి ఇంటి నిర్మాణ అనుమతులను మంజూరు చేసిన విషయం అందరికి తెలిసిందే. సర్వే 248లోని 11 ఎకరాల కన్జర్వేషన్ భూమిలో వెంచర్ చేసిన తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు. ఇక తుర్కయంజాల్ లోని మాసబ్ చెరువు ఎఫ్ టీఎల్ పరిధిలో వెంచర్లు వెలిసిన చర్యలు తీసుకోలేదు, మన్నెగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే సెంటర్లు 1,40.41 లోని ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలకు సహకరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంతా జాబితా ఉంది. మరిన్ని వివరాలు వచ్చే కథనంలో చర్చిద్దాం..