
మర్రిగూడ జూన్ 9 (క్రైమ్ మిర్రర్): మర్రిగూడ మండలం నందు ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో ఆక్సిజన్ తో కూడిన అంబులెన్స్, ఉండడంవల్ల ఎంతోమందికి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, నల్గొండ పట్టణాలకు తరలించేవారు.ప్రస్తుతం ఇట్టి ఆంబులెన్స్ ని నల్గొండ హెడ్ క్వార్టర్స్ కి తరలించడం వల్ల, మర్రిగూడ మండలం, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఉత్తమ వైద్యం అందించడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రస్తుతం ఈ కరోనా కష్టకాలంలో చాలమంది ప్రజలు ఊపిరి ఆడక ఇబ్బంది పడుతూ, వేల రూపాయలు ఖర్చు చేసి ప్రయివేట్ వాహనాలలో హైద్రాబాద్ తరలించేవారని ఆవేధన వ్యక్తం చేసారు.
ప్రస్తుతం మర్రిగూడలో ఆక్సిజన్ తో కూడిన అంబులెన్స్ ప్రాముఖ్యత అత్యవసరమని, మర్రిగూడ సర్పంచ్ నల్ల యాదయ్య అన్నారు. తిరిగి ఇదే అంబులెన్సును మండల కేంద్రానికి తీసుకురావడం వల్ల ఎంతో మంది పేద ప్రజలకు అత్యవసర సమయంలో మెరుగైన వైద్యం అందించవచ్చన్నారు. ఉన్నత అధికారులు స్పందించి ఈ అంబులెన్స్ ను తిరిగి మండల కేంద్రానికి తీసుకురావాలని కోరారు.