Telangana

మర్రిగూడ ఎస్ఐపై అధికారుల వేటు..

క్రైమ్ మిర్ర‌ర్ కథనాల ఎఫెక్ట్ 

మర్రిగూడ ఎస్ఐపై అధికారుల వేటు

ఎస్ఐ క్రాంతికుమార్ ను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు

నల్లగొండ, క్రైమ్ మిర్రర్ : ప్రజలను వంచించి, అందినకాడికి దోచుకుతిందామన్న దుర్భుద్ధి ఎస్ఐకి ఉన్నతాధికారులు సరైన పనిష్మెంట్ ఇచ్చారు. ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వసూళ్లకు పాల్పడటం ఎంతో కాలం నడవదని నిరూపితమైంది. క్రైమ్ మిర్ర‌ర్ వరుస కథనాలతో అవినీతి ఎస్ఐ బాగోతాలు బట్టబయలు అయిపోయాయి. అధికారులు వేటు వేసి ఎస్ఐకి చెంపపెట్టులాంటి సమాధానం చెప్పారు.

వివరాల్లోకి వెళ్తే… మర్రిగూడ ఎస్ఐ క్రాంతికుమార్ ప్రైవేటు సైన్యంతో దందాలకు పాల్ప‌డుతున్నార‌న్న పక్కా సమాచారంతో క్రైమ్ మిర్ర‌ర్ కథనాలను ప్రచురించింది. అలాగే సివిల్ తగాదాల్లో తలదూర్చి అందినకాడికి దండుకుంటున్నారన్న సమాచారంతో బాధితులకు న్యాయం జరిగేలా క్రైమ్ మిర్ర‌ర్ ప్రత్యేక ఫోకస్ తో వార్తలు రాసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న అధికారులు క్రాంతి కుమార్ దందాలపై ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి విచారణ జరిపించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. క్రాంతికుమార్ పై క్రైమ్ మిర్ర‌ర్ ప్రచురితమైన వార్తలు నిజమేనని తేటతెల్లం చేశారు.

ప్రైవేటు సైన్యంతో ఎస్ఐ దందాలు, సివిల్ తగాదాల్లో తలదూర్చిన ఎస్ఐ అంటూ క్రైమ్ మిర్ర‌ర్ ప్రచురితం చేసిన కథనాలపై నల్గొండ డీఐజీ రంగనాథ్ స్పందించి విచారణ జరిపించారు. ఎస్ఐ క్రాంతి కుమార్‌ అరాచకాలు బట్టబయలు కావడంతో అతన్ని జిల్లా హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్రాంతికుమార్ అవినీతిపై నాంపల్లి సర్కిల్ ఇన్ స్పెక్టర్, అడిషనల్ ఎస్పీ నివేదిక అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.