
మాదాపూర్,జూన్ 07 క్రైమ్ మిర్రర్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి బుట్ట కన్వెన్షన్లో సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల సహాయార్థం రక్తదాన శిబిరం సోమవారం నాడు ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని మాదాపూర్ జోన్ డిసిపి వెంకటేశ్వర్లు పర్యవేక్షించి రక్తదానం చేసిన దాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డిసిపి మీడియాతో మాట్లాడుతూ సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాల ప్రకారం ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రక్తం కోసం తలసేమియా బాధితులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు.మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పలువురు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి వచ్చిన దాతలు అందరికీ ధన్యవాదములు తెలియజేశారు. ఇప్పటి వరకు 25 యూనిట్ల రక్తాన్ని సేకరించామని, ఈ రక్తదాన శిబిరం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుందని దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి రక్త దానం చేయాలని చెప్పారు. రక్తదాన శిబిరం ముగిసే సమయానికి 62 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఇన్స్పెక్టర్ సమాచారం ఇవ్వటం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో డిసిపి తోపాటు మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్, ఎస్సైలు వీరప్రసాద్, భాస్కర్, సుఖేందర్రెడ్డి, హారిక, మరియు పోలీసు సిబ్బంది ఉన్నారు.
రాయదుర్గం పీఎస్ లో రక్తదాన శిబిరం..
గచ్చిబౌలి,జూన్ 7 క్రైమ్ మిర్రర్: రాయదుర్గం పోలీస్ స్టేషన్లో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో థలసేమియా బాధితుల సహాయార్థం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని మాదాపూర్ జోన్ డిసిపి వెంకటేశ్వర్లు పర్యవేక్షించి రక్తదానం చేసిన దాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డిసిపి మీడియాతో మాట్లాడుతూ సైబరాబాద్ సీపీ సజ్జనార్ గారి ఆదేశాల ప్రకారం ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రక్తం కోసం తలసేమియా బాధితులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పలువురు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి వచ్చిన దాతలు అందరికీ ధన్యవాదములు తెలియజేశారు. రక్తదాన శిబిరం ముగిసే సమయానికి 53 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఇన్స్పెక్టర్ సమాచారం ఇవ్వటం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో మాదాపూర్ డిసిపి వేంకటేశ్వర్లు, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావుతోపాటు మాదాపూర్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ రెడ్డి, ఎస్సైలు సైదులు, వెంకటేష్, సందీప్ రాజ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.