
దేవరకొండ టౌన్, మే31 క్రైమ్ మిర్రర్: ప్రాణాంతకమైన సెకండ్ వేవ్ కరోనా వైరస్ ను అంతం చేయడం కోసం కంకణబద్ధులై గ్రామస్తుల యొక్క విజ్ఞప్తి మేరకు తాటికోల్ సర్పంచ్ జూలూరు ధనలక్ష్మి సోమవారం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఐసోలేషన్ కేంద్రాన్ని దేవరకొండ డిఎస్పి ఆనంద్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. పది పదిహేను రోజుల కిందట తాటికోల్ గ్రామాల్లో 170 పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కి పడింది. వైరస్ కట్టడి కోసం సర్పంచ్ స్థానిక డి.ఎస్.పి ఆనంద్ రెడ్డి ని సంప్రదించి తాను సొంతంగా అసోసియేషన్ ఏర్పాటు చేస్తానని తెలియజేయడంతో ప్రస్తుతం 5 పడకల బెడ్స్తో ఏర్పాటు చేశారు. 20 పడకల వరకు ఏర్పాటు చేయదలచినా మని చెప్పారు.
ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ ప్రస్తుతం యాక్టివ్ కేసులు 21గా ఉన్నాయని ఆయన తెలిపారు. రోజురోజుకు ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందే ప్రాణాంతక మైనటువంటి పరిస్థితులు ఉన్నాయని వాటిని అరికట్టడం కోసం ఐసోలేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఉమ్మడి కుటుంబాలుతో పాటు చిన్న చిన్న గదులలో ఉండే టువంటి వారికి ఇబ్బందికరంగా మారడంతో తప్పని పరిస్థితుల్లో ఐసోలేషన్ ఏర్పాటు చేసి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సర్పంచ్ ధనలక్ష్మి మాట్లాడుతూ తన గ్రామాల్లో కరోనా కట్టడి కోసం తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని తెలిపారు. ఐసోలేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భోజన సదుపాయాలతో పాటు ఇమ్యూనిటీ కిట్లను అందజేస్తానని ఆమె తెలిపారు. మానవాళి ప్రాణాలను హరించి వేస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటం కోసం ప్రజలంతా కూడా సహకరించాలని ఆమె అన్నారు. ఇందుకోసం ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.