Telangana

అందరూ దోచుకు తినేవాళ్లే.. స్మశాన వాటికలోను అగని దోపిడీ

అందరూ దోచుకు తినే వాళ్లే..
కరోనా వచ్చిందా.. ఇక నిలువు దోపిడే
ఆసుపత్రి నుంచి అంబులెన్స్ వరకు..
ఆఖరకు కర్మ కాలి చనిపోతే..
స్మశాన వాటికలోను అగని దోపిడీ
మాయం అవుతున్న మానవత్వం

హైదరాబాద్,క్రైమ్ మిర్రర్: కరోనా రోగులను ప్రైవేట్ ఆసుపత్రులు, అంబులెన్స్ వాహన దారులు, ఆఖరకు స్మశాన వాటిక నిర్వాహకులు నిలువు దోపిడి చేస్తున్నారు. కరోనా వ్యాధి వచ్చిందని ఆసుపత్రిలో చేరితే చాలు లక్షలాది రూపాయలు బిల్లులతో ఆసుపత్రులు దోచు కుంటుంటే.. ఇక ఆసుపత్రి చెరలనుకునే కరోనా రోగిని అంబులెన్స్ డ్రైవర్లు అడ్డంగా నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆసుపత్రికి చేర్చడానికి దూరంతో నిమిత్తం లేకుండా, 20 వేలకు పైగానే ఆడుతున్నారు. తాము అడిగిన మొత్తం ఇవ్వకుంటే, అసలు రోగిని అంబులెన్స్ దగ్గరకు కూడా చెరనివడం లేదు. కిమీ దూరంలో ఉన్న ఆసుపత్రి కూడా చేరాలంటే కరోనా రోగి, బంధువులు 20 వేల రూపాయలకు పైగానే చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. ఇక ఖర్మ కాలి కరోనా రోగి చనిపోతే స్మశాన వాటిక నిర్వాహకులు సైతం అడ్డంగా దోచుకుంటున్నారు.  దహన సంస్కారాల కోసం రోగి బంధువుల నుంచి 40 నుంచి 50 వేల రూపాయలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా మృతులను దహనం చేయడానికి స్మశాన వాటిక నిర్వాహకులు అధిక మొత్తం డబ్బులు వసూళ్లు చేస్తున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయని, అటువంటి వారిని ఉపేక్షించేది లేదని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, మూసి రివర్ ప్రంట్ చైర్మన్ సుధీర్ రెడ్డి హెచ్చరించారు.

COVID 12 - Crime Mirror

కరోనా వ్యాధితో చనిపోయిన వారిని దహనం, ఖననం చేయాలంటే బంధువుల బాధలు అన్ని, ఇన్ని కాదు. కరోనా మృతులను దహనం చేయాలంటే స్మశాన లలో వేలాది రూపాయలు చెల్లించాల్సిందే నని నిర్వాహకులు పట్టుబడుతున్నారు. నగర శివారు ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు స్మశాన వాటిక నిర్వాహకులపై ఈ తరహా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎల్ బి నగర్ పరిధిలోని నాగోల్, సాహెబ్ నగర్, భూపేష్ గుప్తా నగర్ తదితర స్మశాన వాటికలను సందర్శించారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మృతుల బంధువుల నుంచి డబ్బులు తీసుకోవాలని సూచించారు. అంతే కానీ అధిక మొత్తం వసూళ్లు చేస్తామంటే సహించేది లేదని స్పష్టం చేశారు. కరోనా మృతుల బంధువుల నుంచి 40వేలు మొదలుకుని 50 వేల రూపాయలు వసూలు చేసినట్టు తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. దహనం చేస్తే ఐదు వేలు, ఎలక్ట్రిక్ యంత్రం పై దహనం చేస్తే ప్రభుత్వం నిర్దేశించినట్లుగా ఐదు వేలు, నాలుగు వేల రూపాయలు మాత్రమే తీసుకుని రశీదు ఇవ్వాలన్నారు. ఎల్ బి నగర్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఆసుపత్రులు ఉండడం కరోనా మృతులను తమ స్వస్థలాలకు తరలించడం ఇష్టం లేని బంధువులు స్థానికంగానే దహన సంస్కారాలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇదే అదనుగా స్మశాన వాటిక నిర్వాహకులు దోపిడీకి పాల్పడుతున్నారు. అడిగినంత ఇస్తేనే దహన సంస్కారాలు చేయడానికి అనుమతిని ఇస్తున్నారు. దీనితో చేసేది లేక కరోనా మృతుల బంధువులు స్మశాన వాటిక నిర్వాహకులు అడిగినంత ఇచ్చి సంప్రదాయ బద్దంగా దహన సంస్కారాలు చేపడుతున్నారు. కరోనా బాధిత కుటుంబాలకు చివరకు స్మశాన వాటిక లోను దోపిడీ తప్పడం లేదు.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.