Telangana

విశ్వన్ సాయి హాస్పిటల్ అధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు

ఆపదలో నిరుపేదలకు ఆపన్నహస్తం… ఎల్వి సేవ వేదిక
ఉచిత అంబులెన్స్ సేవలు వినియోగించుకున్న మునుగోడు వాసి

మునుగోడు, క్రైమ్ మిర్రర్: మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీదేవి గూడెం కు చెందిన మేకల యాదగిరి అనే వ్యక్తికి వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్ రాగ వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే ఉంటూ జాగ్రతలు తీసుకుంటున్నాడు. దీంతో  తీవ్రమైన దగ్గు ఆయాసం ఎక్కువై బాధపడుతుండటముతో అతని కుటుంబ సభ్యులు అతనిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని 108 నీ సంప్రదించగా ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్స్ లేవని చేప్పడముతో కుటుంబసభ్యులు ఏమి చేయాలో దిక్కు తోచని సమయములో తెలిసిన వారి సహకారముతో నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశంబజార్ లో గల విశ్వన్ సాయి హాస్పిటల్ డాక్టర్ సందీప్ కుమార్ గారికి విషయం తెలపగా వెంటనే స్పందించిన డాక్టర్ నల్లగొండ ఏళ్వి సేవ వేదిక వారి సహకారముతో అంబులెన్స్ సౌకర్యం కల్పించి పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి పేషెంట్ ను సకాలములో తరలించడం జరిగినది.దీనితో ఆస్పత్రి యాజమాన్యానికి,ఏల్వి సేవ ట్రస్ట్ వారికి పేషెంట్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్వీ సేవ వేదిక అధ్వర్యంలో పేద కుటుంబ ప్రజలకు అందిస్తున్న ఉచిత అంబులెన్స్ సేవలను మండల ప్రజలు ఎవరైనా వినియోగించుకోవాలి అనుకుంటే సెల్ 9440405321,9848050321 గల నంబర్లను సంప్రదించగలరు అని ఆస్పత్రి యాజమాన్యం తెలిపినది.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.