

వికారాబాద్,మే 27 క్రైమ్ మిర్రర్: లాక్డౌన్ సమయంలో ప్రజల రక్షణ కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్న పోలీసులు క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని పరిగి నియోజకవర్గ జర్నలిస్టులు ఆకాంక్షించారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న సీఐ లక్ష్మారెడ్డి, ఎస్ఐ రమేష్, ఏఎస్ఐ చంద్రకళ, పోలీసు సిబ్బందికి జర్నలిస్టు సోదరులు ఎనర్జీ డ్రింక్, స్నాక్స్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని, అత్యవసర పని ఉంటేనే రావాలని తెలిపారు. ప్రజల కోసం 24గంటలు పనిచేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు వి6 న్యూస్ రాఘవేందర్‌రెడ్డి, టివి9 పవన్‌కుమార్‌రెడ్డి, ఎన్టీవీ శ్రీనివాస్, టి న్యూస్ రాజేశ్, 4 టివి చాంద్‌పాషా పాల్గొన్నారు.