Telangana

వసూల్ రాజాలు….శృతి మించిన కొందరు కౌన్సిలర్లు, వారి భర్తల ఆగడాలు..

– తుర్కయంజాల్ పురపాలక సంఘం పరిధిలో పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లు.
-ఏ నిర్మాణం అయినా సరే అడిగిన కాడికి ఇవ్వాల్సిందే…….
-మున్సిపల్ అధికారులు, మీడియా పేరు చెప్పుకుని డబ్బుల డిమాండ్……
– శృతి మించిన కొందరు కౌన్సిలర్లు, వారి భర్తల ఆగడాలు..
-మరి కొందరి బాగోతాలు వచ్చే కథనంలో మీ ముందుకు…

తుర్కయంజాల్,ప్రతినిధి క్రైమ్ మిర్రర్:

తుర్కయంజాల్ పురపాలక సంఘం పరిధిలో కొందరు కౌన్సిలర్లు, వారి భర్తల అక్రమ వసూళ్లకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. చిన్న రేకుల షెడ్ నిర్మాణం అయినా సరే, ఏళ్లకు ఏళ్లు కష్టపడి రూపాయి రూపాయి కూడ బెట్టుకుని నిర్మాణం చేపట్టుకుంటున్న చిన్న ఇళ్లు అయినా సరే ముందుగా వీరికి అడిగిన కాడికి ఇవ్వాల్సిందే. ఇక కమర్షియల్ భవనాలు అయితే వీరికి పండగే పండుగ. నిబంధనలకు విరుద్ధంగా ఉండి హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇళ్ల నిర్మాణ అనుమతులు రాని వాటికి ఇక మాములుగా డిమాండ్ చేయరు. వీరి పేరు చెప్పుకునే కాకుండా అధికారులను మేమే చూసుకుంటామని, మీడియా వాళ్లకు కూడ ఇవ్వాలనే కారణాలతో నిర్మాణదారుల ముక్కుపిండి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు.

జవాన్లతో సెటిల్మెంట్…
కమ్మగూడలోని సైబర్ సిటీ వెంచర్ లో ఒక వ్యక్తి తన 150 గజాల ఇంటి స్థలానికి అనుమతి తీసుకుని నిర్మాణ పనులు చేపడుతుండగా పలుమార్లు మున్సిపల్ కార్యాలయానికి చెందిన ఒక జవాన్ వెళ్లి పనులు నిలిపివేయాలని ,మీ దగ్గర ఏ అనుమతి పత్రాలు ఉన్నాయో చూపించాలని ఆదేశాలు జారీచేశాడు. మాకు అన్ని అనుమతులు ఉన్నాయి అని చెప్పినా వినకుండా లోకల్ కౌన్సిలర్ పంపించాడు. మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించండి వాటిని తీసుకువెళ్లి కౌన్సిలరకు ఇస్తానన్నాడు. అన్ని ఉన్నా ఇబ్బందులు పెడుతుండటంతో సదరు నిర్మాణదారుడు తనకు స్థానికంగా తెలిసిన ఒక వ్యక్తిని సంప్రదించగా రూ.25వేలు ఇస్తే విషయం సెట్ చేస్తానని హామి ఇవ్వడంతో అన్ని సరిగ్గానే ఉన్నా నేను ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఈ ఒక్క వార్డులోనే కాకుండా చాలా వార్డుల్లో కౌన్సిలర్లు, వారి భర్తలు సేఫ్ సైడ్ లో ఉంటూ మున్సిపల్ జవాన్ లను రంగంలోకి దింపుతున్నారు.

yamjal 1 - Crime Mirror

ప్రతి నిర్మాణం నుంచి వసూళ్లు…

తుర్కయంజాల్ లోని శోభా నగర్ ప్రాంఠంలో గతంలో ఓ చిన్న కుంట ఉండేది. కాలక్రమేణా ఆ కుంటను రియల్ మాఫియా పూర్తిగా కబ్జా చేసి ప్లాట్లుగా మార్చింది. వాటిని కొనుగోలు చేసిన ఆమాయకులు నిర్మాణ అనుమతులు రాక ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఓ కౌన్సిలర్ భర్త పెద్ద ఎత్తున ఆక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఇటీవల అనుమతులు లేని నిర్మాణాల పైన మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడానికి వెళ్తే సదరు నిర్మాణదారులు డబ్బులు తీసుకుని కూడ ఎలా చర్యలు తీసుకుంటారని ప్రశ్నించడంతో అధికారులు నోరు
వెళ్లబెట్టారు. డబ్బులు తీసుకున్న కౌన్సిలర్ భర్త మరుసటి రోజు తాను సేఫ్ సైడ్ ఉండాలనే భావనతో ఆధికారుల మీదికి బాధితులను ఎగబెట్టాడు. ఇక్కడ నిర్మాణంలో ఉన్న ప్రతి ఇంటి నుంచి ముందుగా కౌన్సిలర్ పేరు చెప్పుకుని, ఆ తర్వాత అధికారుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇది చాలదు అన్నట్లు పేపర్ వాళ్లకు పైసలు ఇవ్వాలి లేదంటే వార్తలు రాసి కూలగొట్టిస్తారని నమ్మించి వసూళ్లు చేస్తుండటం గమనార్హం.

బార్డర్ పంచాయితీ…

మన్నెగూడలోని ప్రభుత్వ సర్వే నెంబర్ 41లో ఒక వ్యక్తి మడిగెల నిర్మాణ పనులు చేపడుతుండగా అధికారులు ఇటీవల కూల్చిన విషయం తెలిసిందే. ఈ నిర్మాణం పురపాలక సంఘం పరిధిలోని రెండు వార్డులకు బార్డర్‌లో ఉంది. ముందుగా సదరు నిర్మాణదారుడు రాగన్నగూడ పరిధిలోని ఓ కొన్సిలర్ భర్తను మేనేజ్ చేశాడు. కానీ తుర్కయంజాల్ కు చెందిన ఓ కౌన్సిలర్ భర్త ఇది నా వార్డు అని ,నీవు అక్కడ ఎలా డబ్బులు తీసుకుంటావని డైరెక్టుగా ప్రశ్నించాడు. ఇది నా పరిధి అంటే నాది అని ఇద్దరు కౌన్సిలర్ల భర్తలు పలుమార్లు ఫిర్యాదులు చేసుకున్నారు. విషయం చినుకు చినుకు గాలి వానగా మారడంతో స్థానికంగా ఉండే ఓ పెద్ద మనిషి దగ్గర పంచాయితీ వెళ్లడంతో ఆయను దాన్ని సెట్ చేయించినట్లు తెలుస్తుంది. సదరు నిర్మాణదారుడిది ఆక్రమ నిర్మాణం కావడంతో చేసేదేమి లేక ఇద్దరికి ఆడ్జెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

చిన్నా చితకా ఏ నిర్మాణం ఆయినా…

ఆయన పేరు చెప్పుకుని తిరిగితే మార్కెట్ లో అంత విలువ ఉండదు అన్న భావనతో కమ్మగూడకు చెందిన ఓ కౌన్సిలర్ భర్త మున్సిపల్ అధికారులు, మీడియా వారిని మేనేజ్ చేయాలనే పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతుండటం పలుమార్లు బయటపడిన విషయం తెలిసిందే. ఈ వార్డులో చిన్నా, చితకా ఏ నిర్మాణం అయినా సదరు కౌన్సిలర్ భర్తకు ముట్టజెప్పాల్సిందే. లేదంటే వీధి ధీపాలు ఆర్పివేయిస్తాడు..అభివృద్ధి పనులు నిలిపివేయిస్తానని బెదిరిస్తాడు.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.