Telangana

కొడుకు, బంధువులు ఉన్నా… వృద్ధ దంపతుల ఆకలి చావు

మంచిర్యాల జిల్లా ప్రతినిధి, మే 22 క్రైమ్ మిర్రర్: లక్షెట్టిపేట పట్టెడన్నం పెట్టేవారు లేక ఆకలితో అలమటించి వృద్ధ దంపతులు ఓకేసారి మరణించిన విషాద ఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం లోని పాత కొమ్ముగూడెం లో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆ గ్రామానికి చెందిన బియ్యాల రాజయ్య(75), మల్లవ్వ(70) అనే వృద్ధ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉండగా, ఈ మధ్య ఒక కొడుకు పురుగుల మందు త్రాగి ఆత్మహత్య కు పాల్పడి మరణించాడు. గత కొన్ని రోజులుగా ఆ దంపతులు అనారోగ్యంతో మంచం లో నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నారు. దీనికితోడు కుటుంబ కలహాలతో మరో కొడుకు ఊరు విడిచి వెళ్లిపోవడంతో ఈ వృద్ధ దంపతులకు తిండి పెట్టె వారు కరువయ్యారు. అనారోగ్యంతో ఉన్న వారి వద్దకు ఇరుగుపొరుగు వారు కూడా వెళ్ల లేకపోవడంతో గత మూడు రోజులుగా తిండిలేక ఆకలికి అలమటించి మంచంలోనే కన్నుమూశారు. శనివారం ఆ దంపతులు ఉన్న ఇంటి నుండి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా వృద్ధ దంపతులు మరణించి ఉన్నారు. కొడుకు,బంధువులు ఉన్నా చివరికి అన్నం లేక మరణించిన ఈ విషాద ఘటన పలువురిని కలిసివేసింది. సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను మంచిర్యాల ఏ సి పి అఖిల్ మహాజన్ పరిశీలించారు .అన్ని కోణాల్లో పరిశీలించగా వృద్ధులు ఆకలిని తట్టుకోలేక మరణించినట్లు గా ప్రాధమిక దర్యాప్తు లో తెలిసిందని ఆయన తెలిపారు. ఆయన వెంట లక్షెట్టిపేట సీఐ నారాయణ నాయక్, ఎస్ఐ చంద్రశేఖర్ ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.