

- బిజెపి మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు చేవ్వ శేషగిరి యాదవ్
భూపాలపల్లి, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి: ప్రజల ప్రాణాలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని బిజెపి మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు చేవ్వ శేషగిరి యాదవ్ ఆరొపించారు. శనివారం రోజున ఆయన విలెకరులతో మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర కమిటీ పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చెయడాన్ని స్వాగతిస్థున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రజలందరూ కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దున్నపోతు మీద వాన పడినట్టుగా వ్యవహరిస్తుందని శేషగిరి యాదవ్ ఎద్దెవా చేశారు. ఆక్సిజన్ లేక అనేకమంది ప్రజలు కరోనా బారిన పడి చనిపోతున్నా ఆక్సిజన్ అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కరోనాను వెంటనే ఆరోగ్య శ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, కరోనా కాలంలో ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా పేరుతో ప్రైవేట్ హాస్పిటల్స్ ల్లో విచ్చలవిడిగా డబ్బులను వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ లపై అధికారుల పర్యవేక్షణ ఉండాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్న జర్నలిస్టులకు భరోసా లేదని ఆవేదన చెందారు. తక్షణమే కరోనా సహాయక చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.