Telangana

రాజీవ్ గాంధీ ఆశయాలను సాధిస్తాం… కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్

ఖమ్మం జిల్లా ప్రతినిధి, మే 22 క్రైమ్ మిర్రర్: ఖమ్మం అసెంబ్లీ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొండూరి హృదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ లో రాజీవ్ గాంధీ వర్ధంతి పురస్కరించుకొని నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్ ఖమ్మం సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు జావిద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్ మాట్లాడుతూ భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం పాటుపడుతాం అన్నారు. కడుపునిండా తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు అసమానతలు లేని సమాజంమే ఈ దేశ ప్రజలు కోరుకున్నేది. కానీ నేడు ఈ దేశంలో తాగే నీటి నుండి ప్రాణాలు కాపాడే వైద్యుల వరకు రాజకీయాలు చేస్తూ ఈ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు మోకరిల్లి పరిస్థితి తీసుకు వచ్చారు. ఇదేనా రాజీవ్ గాంధీ కలలు కన్నా భారతదేశం అనే సందేహం నేడు కలుగుతుంది అని వాపోయారు. లాక్ డౌన్ వల్ల ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ లో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. దేశ ప్రజలకు సేవ చేయడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అని దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ కార్యకర్త చేతనైన సహాయం అందించాలని అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ యస్ యుఐ జిల్లా అధ్యక్షులు వేగినాటి ఉదయ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ పవన్ సాయి అబి తదితరులు పాల్గొన్నారు.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.