Telangana

తుక్కుగూడ మున్సిపల్ కేంద్రంలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి

జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్  జైన్ కు వినతిపత్రం సమర్పించిన బీజేపీ బృందం

మహేశ్వరం, ప్రతినిధి,మే 17(క్రైమ్ మిర్రర్): మహేశ్వరం మండల కేంద్రం తుక్కుగూడ మున్సిపల్ కేంద్రం లో100 పడకలతో ఒక ఐసోలేషన్ సెంటర్  ఏర్పాటు చేయాలని కోరుతూ  తుక్కుగూడ మున్సిపల్ బీజేపీ నాయకుల బృందం రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్  జైన్ ని కలెక్టర్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. మరియు జిల్లా వైద్య అధికారి స్వరాజ్యం కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  తుక్కుగూడ మున్సిపల్ కేంద్రంలో  కరోనా పాజిటివ్ కేసులో విపరీతంగా పెరుగుతున్నందున  తక్షణమే  కరోనా టెస్టింగ్ మరియు వ్యాక్సిన్ తోపాటు  100 పడకల ఐసోలేషన్ సెంటర్ లో ఏర్పాటు చేయాలని కోరారు.

 

ప్రజలు  కరోనా తో ఇబ్బందులు పడుతున్నారని వారి ఇబ్బందులను గుర్తించి తక్షణమే  ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. తుక్కుగూడ మున్సిపల్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం  వలన ప్రజలు ఆందోళన చెందుతున్నారని  ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా  వ్యాక్సిన్  టెస్టింగ్ మరియు  ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని వారు కోరారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల కేసులు పెరుగుతున్నాయని తక్షణమే నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపాలిటీ అధ్యక్షులు రచ్చ లక్ష్మణ్,  బీజేపీ కౌన్సిలర్లు రాజమోనీ రాజు ముదిరాజ్,  బరిగల హేమలత రాజు, జపాల భావనా, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు..

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.