

వికారాబాద్ మే 17,(క్రైమ్ మిర్రర్); దౌల్తాబాద్; మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర సోమవారం నాడు రైతులు ధర్నా రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా గత 20 రోజుల నుండి వరి ధాన్యం బస్తాలు నిల్వ చేశారు. అయితే అధికారులు మాత్రం నేడు రేపు అని కాలం వెళ్లదీస్తూ రైతులకు పరేషాన్,, చేస్తున్నారని,మండల గ్రామీణ ప్రాంతాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వరి ధాన్యం,కొనుగోలు కు ప్రభుత్వం పీఏసీఎస్,కో ఆపరేటివ్ వాళ్లకు అప్పజెప్పారు. దాదాపు మండల కేంద్రంలో ఉన్న వరి ధాన్యం నిల్వలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
అదేవిధంగా మండల వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు చేసి లారీల్లో లోడ్ చేసి పంపాల్సిన బాధ్యత అధికారుల పై ఉందని వారేమే అసలు మాకు సంబంధమే లేనట్లుగా వ్యవహరిస్తున్నారని రైతులు మండి పడుతున్నారు. ఇదే విషయమై పీఏసిఎస్, అధికారులు ఆనంతయ్య, ను వివరణ కోరగా మండల కేంద్రంలో ఇప్పటిదాకా 14, వేల 400 క్వింటాల వరి ధాన్యలను కొనుగోలు చేశామని అందులో 5 వేల200 క్వింటాళ్లు, మాత్రమె మిల్లుకు పంపడం జరిగిందని చెప్పారు. మిగితా మిగిలిన ధాన్యం లారీల కొరత ఉన్నందున కొంత మేరకు ఆలస్యం అవుతుందని చెప్పారు. అలాగే మండల కేంద్రంలో ధాన్యం బస్తాలు,కూడా ఈసారి 50,వేలు మాత్రమే వచ్చాయని,వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. మండలానికి గన్ని, బ్యాగుల కొరత కూడా ఉందని రైతులు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుండి గన్ని బ్యాగులు, లక్ష,50, వేల బ్యాగులు రావాల్సిన ఉన్న కేవలం 50వేలు మాత్రమే వచ్చాయని ఇంకా లక్ష గన్ని, బ్యాగులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ధర్నా చేస్తున్న రైతులకు మండల తహశీల్దార్ సర్దార్ హార్దిప్ సింగ్,రైతులకు సర్దిచేప్పిి తమ సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
పీఏసీఎస్,, అధికారి మాట్లాడుతూ
లారీల కొరత ఉన్న విషయం వాస్తవమే,అదేవిధంగా రైతులు మాట్లాడుతూ తక్షణమే స్థానిక ఎమ్మెల్యే,స్పందించి, రైతులనుి వెంటనే అవసరమైన లారీలను తెప్పించి వరి ధాన్యం లోడ్ చేసి రైతులకు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.