

అక్రమ నిర్మాణాలను పకడ్బందీగా కట్టడి చేయండి
భవనిర్మాణం కోసం తీసిన పిల్లర్లను పూడ్చివేయాలి
రోడ్డు విస్తరణ చేపట్టకపోతే … ప్రమాదాలు జరిగే అస్కారం
ఆర్ అండ్ బీ అధికారులను, ఎంపీడీఓను కోరిన
శివన్నగూడెం ఎంపీటీసీ దాసరి మమతా
(కైమ్మిరర్ ప్రతినిధి- నల్గొండ)
నల్లొండ జిల్లా మర్రిగూడ మండల పరిధిలోని శివన్నగూడెంలో రోడ్డు పక్కనే కొనసాగుతున్న అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని స్టానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై ఆర్ అండ్ బీ అధికారులకు, ఎంపీడీవోలను శివన్నగూడెం ఎంపీటీసీ దాసరి మమత కోరారు. శివన్నగూడెంలో కొనసాగుతున్న చర్లగూడా ప్రాజెక్టు పనుల నిమిత్తం టిప్పర్లు పెద్ద సంఖ్యలో గ్రామం మీదుగా వెళ్తున్నాయన్నారు. దానితో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. అందుకే శివన్నగూడెం గ్రామంలోని రోడ్డును విస్తరించాలని ఆర్ అండ్ బీ అధికారులు నిర్ణయించి, రోడ్డు విస్తరణకు అవసరమైన స్ధల సేకరణకు సంబంధించి మార్కింగ్ చేశారన్నారు. అయితే రోడ్డు విస్తరణకు అవసరమైన స్ధలంలో అక్రమ భవన నిర్మాణం చేపడుతున్న విషయాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారన్నారు.
అయినా నిర్మాణాన్ని అడ్డుకునేందుకు పకడ్చందీగా చర్యలు తీసుకోకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేవలం నోటీసులిచ్చి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. ఇకనైనా అధికారులు తక్షణపే స్పందించి రోడ్డు విస్తరణ స్థలంలో చేపడుతున్న భవననిర్మాణాన్ని పూర్తిగా అడ్డుకోవాలన్నారు. నిర్మాణం కోసం తీసిన పిల్లర్ల గుంతలను పూడ్చివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రోడ్డు విస్తరణ జాప్యం జరిగే ప్రవూదముందని దాసరి మమత ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ చేపట్టకపోతే భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అస్కారం లేకపోలేదన్నారు.