Telangana

ప్రధాన రహదారి కబ్జాకు యత్నం… వార్డు సభ్యుని నిర్వాహకం

  • రోడ్డు విస్తరణకు ఆర్‌అండ్‌బీ అధికారుల మార్కింగ్‌
  • గతంలో నిర్మాణయత్నాన్ని అడ్డుకున్న అధికారులు
  • వార్డు సభ్యుని రంగప్రవేశం మారిన సీన్‌
  • రాత్రికి రాత్రే ఇంటి నిర్మాణానికి పిల్లర్లు
  • కర్ఫూ నిబంధనలకు తూట్లు
  • అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన స్థానికులు
  • అయినా చోద్యం చూస్తున్న అధికారులు

(కైమ్‌మిర్రర్‌ ప్రతినిధి – నల్లొండ )

నల్గొండ జిల్లా మర్రిగూడ మండల పరిధిలోని శివన్నగూడెంలో ప్రధాన రహదారిని ఓ వార్డు సభ్యుడు కబ్బా చేసి నిర్మాణాన్ని చేపడుతున్నారు. తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని రోడ్డు విస్తరణ స్థలంలో ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రధాన రహదారిని విస్తరించబోతున్నారన్న విషయాన్ని తెలిసి స్టానిక ప్రజాప్రతినిధిగా ప్రజల చేత ఎన్నికై ఒక సభ్యుడు ఇంటి నిర్మాణం చేపడుతుండడం పట్ల గ్రామస్థులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రేపు రోడ్డు విస్తరణ ఎలా చేపడుతారో అంతుచిక్కడం లేదంటున్నారు. రోడ్డు విస్తరణకు అడ్డంగా చేపడుతున్న నిర్మాణాన్ని ప్రాథమికదశలోనే అడ్డుకోవాలని కోరుతున్నారు. లేకపోతే భవిష్యత్తులో స్థలసేకరణకు సముస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. రోడ్డు విస్తరణకు అడ్డుకునేవిధంగా వార్డు సభ్యుడి రోడ్డు కబ్బాకు, గ్రామపెద్దల అండదండలుండడంతో అధికారులు కూడా చూసీ, చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. శివన్నగూడెం ప్రధాన రహదారిని విస్తరించాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులు నిర్ణయించారు. ఈమేరకు గ్రామంలో ప్రధాన రహదారి విస్తరణకు అవసరమైన స్ధల సేకరణకు ఇటీవల మార్కింగ్‌ చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా పలువురు ఇళ్లస్టలాలు కోల్పోతున్నారు. వారికి ప్రభుత్వ పరిహారం అందజేయాలని నిర్ణయించింది. అదే విధంగా శివన్నగూడెం బస్సుస్టాండ్‌ సమీపంలోను రోడ్డు విస్తరణలో ఉన్న ఓ ఇంటి యజమాని నిర్మాణాన్ని చేపట్టబోయారు. అధికారులు వెనువెంటనే స్పందించి ఇంటి యజమానికి నోటీసులు జారీ చేశారు. పిల్లర్ల కోసం తీసిన గుంతలను సైతం పూడిచారు. దానితో సదరు ఇంటి యజమాని ఇంటి నిర్మాణంపై ఆశలు వదలుకున్నారు. ప్రధాన రహదారిపై ఉన్న కమర్షియల్ స్థలంపై వార్డు సభ్యుడి కన్ను పడింది. వెంటనే సదురు స్థల యజమాని సంప్రదించి అతి తక్కువ ధరకు స్థలాన్ని కొనుగోలు చేశారు. అయితే రోడ్డు విస్తరణలో ఉన్న స్థలానికి ఎంత వచ్చినా ఫర్వాలేదన్నట్లుగా సదరు యజమాని తన స్థలాన్ని వికయించాడు. ఇక స్థలాన్ని కొనుగోలు వేసిన వార్డు సభ్యుడిప్పుడు నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు విస్తరణలో ఉన్న స్థలంలో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇంటి నిర్మాణం కోసం కర్ఫ్యూ నిబంధనలను సైతం వార్డు సభ్యుడు ఉల్లంఘించి రాత్రింభవళ్లు కార్మికుల చేత పనిచేయిస్తున్నారు. ఈవిషయాన్ని స్థానిక అధికారుల దృష్టికి గ్రామస్థులు తీసుకువెళ్లారు. తాము పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ, నిర్మాణం మాత్రం యధావిధిగా కొన సాగుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

వార్డు సభ్యుడైతే రోడ్డులో ఇళ్లు కడుతారా?

ప్రజోపయోగార్ధం రోడ్డు విస్తరణ కోసం సేకరించనున్న స్థలంలో వార్డు సభ్యుడైతే ఇళ్లు కడుతుంటే అధికారులు చూస్తు ఊరుకుంటారా?, అదే సామాన్యుడు ఇలాగే చేస్తే ఆఘవేఫఘాల మీద స్పందించే అధికారులు, వార్డు సభ్యుడి విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నది అంతుచిక్కడం లేదని శివన్నగూడెం గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకువెళితే, తాము నోటీసులు జారీ వేస్తామని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయడంపై వారు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణం కోసం పిల్లరు గుంతలు తీసి, పనిచేస్తున్నారని చెప్పిన చూస్తాం… చేస్తావమునడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఇదే విషయాన్ని ఎంపీడీవో దృష్టికి తీసుకువెళ్లగా తాను పరిశీలిస్తానని చెప్పి ముక్తసరిగా సమాధానం ఇవ్వడం పట్ల గ్రామస్థులు విస్మయాన్ని వ్యక్తంచేస్తున్నారు.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.