Telangana

బీసీల ఎదుగుదలను ఓర్వలేకనే ఈటలపై కెసిఆర్ కుట్ర

భూపాలపల్లి, మే 2 క్రైమ్ మిర్రర్: బీసీల ఎదుగుదలను ఓర్వలేకనే బీసీ నేత, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర పూరితమైన పన్నాగం పన్నాడని ముదిరాజ్ మహాసభ మండల కన్వీనర్ దేవునూరి కుమార్, మండల కో కన్వీనర్ దానవేణి రాములు ఆరోపించారు. ఆదివారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో జరిగిన ముదిరాజ్ మహాసభ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ
మున్సిపల్ ఎన్నికల ముగింపు అనంతరం బీసీ నేత ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పైన ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రపూరితమైన ఆరోపణలు చేయడం జరిగినదని శనివారం ఉదయమే విచారణ కమిటీని వేసి దాని నివేదిక రాకముందే ఈటల రాజేందర్ మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయడం చాలా అన్యాయమని అన్నారు. కెసిఆర్ మంత్రి వర్గంలో అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేల మీద వందల ఎకరాల భూ ఆక్రమణ ఆరోపణలు ఉన్నప్పటికీ ఎవరి పైన కూడా విచారణ పేరు మీద కమిటీని వెయ్యకుండా, కేవలం ఒక బీసీ మంత్రికి రాష్ట్రంలో అతనికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఈటల రాజేందర్ ను అణచివేసే ఉద్దేశంతో తక్షణమే అతనిపై విచారణ చేపట్టి విచారణ నివేదిక రాకుండానే బర్తరఫ్ చేయడంలో మతలబు ఏమిటి అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి ప్రతి ఉద్యమానికి నాయకత్వం వహించి, తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆవిర్భావానికి ఎంతో కృషి చేసిన ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఆరుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొంది మచ్చలేని నాయకుడుగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ ప్రజల మన్నలను పొందుతూ, మెజార్టీ ప్రజల ఆదరాభిమానాలను పొందుతూ, రాష్ట్ర మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉంటూ రాష్ట్రంలో కరోనా విపత్కర పరిస్థితిలో కంటి మీద నిద్ర లేకుండా అహర్నిశలు కృషి చేస్తూ ఆరోగ్యశాఖ మీద గట్టి పట్టు సాధించి కరోనా నివారణ చేపట్టడంలో రాష్ట్రంలో పటిష్టంగా చేసి, అందరి ప్రజల ప్రజాదరణ పొందిన ఈటల రాజేందర్ ను ఓర్వలేకనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం జరిగిందని అన్నారు. ఈటల ను తక్షణమే మంత్రివర్గంలోకి తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర జనాభాలో 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజల ఆగ్రహానికి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం గురి కాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కందుల సారయ్య, వేముల చంద్రమౌళి, దార్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.