Telangana

కనికరం లేకుండా తరిమికొట్టారు – ఓ వృద్ద తల్లి ఆవేదన

భూపాలపల్లి జిల్లా, ఏప్రిల్ 10 క్రైమ్ మిర్రర్ : కనికరం లేకుండానే ఓ వృద్దురాలైన కన్న తల్లిని తన చిన్న కుమారుని కుటుంబం తరిమికొట్టిందని కలెక్టర్, ఆర్డీఓ, జిల్లా పంచాయత్ రాజ్ అధికారులకు ఇచ్చిన పీర్యాదులో తెలిపింది. వివరాల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన మండ లచ్చమ్మ (80) అనే వృద్ధురాలికి నలుగురు సంతానం ఉండగా వీరిలో ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులుండగా వారికి పెండ్లిండ్లు చేసి చిట్యాల మండల కేంద్రంలో తన భర్త ఆగు కీ: శే: మండ ఎల్లయ్యకు ఉండబడినటువంటి 41/2 గంటల ఇల్లడుగు స్థలంలో రేకుల షెడ్డు వేసుకుని కూలీ పనులు చేసుకుంటూ జీవనాన్ని గడుపుతుండగా, తన చిన్న కుమారుడైన మండ దర్శనం, వారి కుటుంబ సభ్యుల కన్ను ఇంటిపై, ఇంటి స్థలంపై పడింది. ఇంకేముంది ఆ ఇంటిని, ఇంటి స్థలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే దురభిప్రాయంతో పంచాయతి కార్యదర్శితో కుమ్మక్కై ప్రణాళికలు చేసుకున్నారు. తాను నిర్మాణం చేసుకున్న ఇంటి ప్రక్కకు చిన్న రేకుల షెడ్డు వేసుకుని తోడుగా ఉంటానని, బ్రతుకు దెరువు నిమిత్తం హైదరాబాద్ కు వలస వెళ్లిన తన పెద్ద కుమారుడు వచ్చిన తర్వాత ఇల్లడుగు స్థలమును, పంచుకుని నిన్ను సాదు కుంటామని నమ్మబలికి చిన్నగా రేకుల షెడ్డు వేసుకున్నాడు. ఇంకేముంది పంచాయతీ కార్యదర్శి అండదండలతో తనదే ఇల్లు, ఇంటి స్థలం అన్నట్లుగా గ్రామ పంచాయతీ రికార్డుల్లో పేరు నమోద్ చేసుకున్నప్పటి నుంచి నన్ను ఇంట్లో ఉండనీయకుండా, కరెంట్ కట్ చేసి, నీళ్లను పట్టుకోనివ్వకుండా, మరుగుదొడ్డికి వెళ్లనీయకుండా విపరీతంగా భూతులు తిడుతూ, నన్ను చిత్రహింసలకు గురి చేస్తూ రాచి రంపాన పెడుతున్నారని పిర్యధులో తెలిపింది. అదే విధంగా నా భర్తకు సంబంధించి గౌడ కులంలో వచ్చిన ఒకటిన్నర చిరుక తాళ్లను, గౌడ సంఘం ద్వారా వచ్చిన ప్లాట్లను సైతం అమ్మేందుకు కుట్రలు చేస్తున్నాడని ఆమె తెలిపింది. అదేవిధంగా నిర్మించుకున్న మరుగుదొడ్డికి సైతం డబ్బులు రాకుండా పంచాయతీ కార్యదర్శి అడ్డుకుంటుందని తెలిపింది. ఇప్పుడు ప్రస్తుతం తన చిన్న కుమార్తె వద్ద ఆశ్రయం పొందుతున్నానని, ఇది తనకు శాశ్వతం కాదని తెలిపింది. సంబందిత అధికారులు స్పందించి ఆదుకోవాలని ఆ వృద్ధురాలు వేడుకుంటుంది.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.