Telangana

శివాలయం సందర్శించిన యాదాద్రి ప్రధాన సఫతీ

మునుగోడు, ఏప్రిల్ 7 క్రైమ్ మిర్రర్ : యాదాద్రి దేవస్థాన ప్రధాన సఫతి అనందచారి వేలు బుధవారము రోజు మండల కేంద్రంలోని ప్రాచీన శివాలయము ప్రధాన పూజారి కండోజు నవీన్ కుమార్ ఆహ్వానం మేరకు బుధవారము రోజు అలయాని సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ కమిటీ సాధారణంగా స్వాగతము పలికిన అనంతరము గర్భాలయం లో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయంలోని ప్రతిష్టించిన విగ్రహాలను పరిశీలించారు. ఆలయములో కొన్ని మార్పులు చేపట్టాలని సూచించారు. అనంతరము ఆయన మాట్లాడుతూ ఆలయ కట్టడం చాన అద్భుతమైన నిర్మాణం అని ఇది కాకతీయుల కాలం నాటి పురాతన దేవాలయల్లో మునుగోడు శివ రామాలయం ఒకటి అని ఇలాంటి దేవాలయాలను దర్శించుకోవడం ద్వారా భక్తుల్లో చాన ప్రశాంతత నెలకొంటుంది అని అన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ పాల్వాయి చెన్నారెడ్డి సఫతినీ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమములో శ్రిరామోజు శ్రీనివాస్,మోఘుధాల నర్సింహ, మహేష్, ప్రవీణ్, రవి తేజ, మధు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.