NalgondaTelangana

రిజర్వాయర్ పనులను అడ్డుకున్న భునిర్వాసితులు …

క్రైమ్ మిర్రర్, మర్రిగూడ: తమకు రావలసిన పూర్తి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని, శివన్నగూడెం రిజర్వాయర్ ముంపు బాధితులు ధర్నాకు దిగారు. రిజర్వాయర్ కట్టపై టెంట్ వేసి పనులు నిలిపివెయ్యాలని నర్సిరెడ్డిగూడెం గ్రామ ప్రజలు ఆందోళన చెపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు పనులు నిలిపివెయ్యాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే కరెంట్, నీటి కొరతతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, గత సంవత్సరం ఎక్కువ వర్షాల కారణంగా నర్సిరెడ్డిగూడెం గ్రామం పై భాగంలో ఉన్న పాత చెరువు నిండి వరద ఊరిని ముంచడంతో, అధికారులు చర్యలు తీసుకొని నీటిని బయటికి పంపే చర్యలు తీసుకున్నారని, కానీ ప్రస్తుతం చుక్క నీరు బయటికి వెల్లే అవకాశం లేకుండా చుట్టు కూడా పెద్ద ఎత్తున కట్టను నిర్మిస్తున్నారని వాపోయారు.

నిన్నామొన్న కురిసిన వర్షాలకే చెరువు నిండుతుందనే భయంతో ఉన్న మాకు, ఈ కట్ట నిర్మాణం తీవ్రంగా భయందోళనలకు గురిచేస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమైనా తమకు పూర్తి నష్టపరిహారం తరువాతే పనులు ప్రారంభించాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో లోడె వెంకటయ్య, మాదగోని సత్తయ్య, ఐతగోని అంజయ్య, ముద్దం ఎల్లయ్య, మాదగోని ధర్మయ్య, పెరుమళ్ళ వెంకటయ్య, ముద్దం వెంకటయ్య, కాటం నర్సింహా, కర్నాటి మల్లమ్మ, బక్కమ్మ, ముద్దం జయమ్మ, తదితరులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి: 

  1. సీఎం క్యాంప్ ఆఫీస్ ఎక్కడంటే
  2. మట్టి మాఫియా విచ్చలవిడిగా..
  3. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న ప్రధాని మోడి.
  4. కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్‌ అరెస్ట్

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.