National

ప్రేమించిన భార్య.. ఘోర హత్యకు గురైన ప్రేమికుడు

క్రైమ్ మిర్రర్,  ఆన్ లైన్ డెస్క్: తనను అన్ని విధాలుగా నమ్మి,  నువ్వే నాకు అన్నిఅని  ప్రామిస్ చేసిన భర్త.. భార్య ప్రవర్తనపై అనుమానం., గతంలో  తన భార్య ప్రేమించిన ప్రయుడితో చెట్టాపట్టాలేసుకుంటు తిరుగుతుందన్ని కసి.. ఆ భర్తలో రగులుతున్న అగ్ని జ్వాల.. వెరసి.. ప్రేమికుడి దారుణ హత్య.. కటకటాల  పాలైన భర్త.. ఇది టూకీగా ఈ  కధలోని సారాంశం. ఇక వివరాల్లోకి వెళ్లితే, .. 

ఎవరూ ఊహించని విధంగా  జరిగిన ఈ దారుణ హత్య ఇండోర్ లో చోటు చేసుకుంది. దాంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనాన్ని రేపింది.పెళ్లయిన తర్వాత కూడా తన భార్య తరచూ ప్రేమికుడితో మాట్లాడుతుండేది.  అందుకు కారణం కూడా ఆమె వేరేగా చెప్పింది. తన భర్త మాట వినకపోవడంతో ప్రియుడిని దగ్గరకు చేర్చుకున్నాని నిస్సిగ్గుగా చెపింది ఆ ఇల్లాలు. ఇది భరించలేని భర్త , ప్రియుడిని ఖతం చేసేందుకు హంతకులకు సుఫారీ  ఇచ్చాడు.

Read More : చత్తీస్ ఘడ్ లో మావోల ఘాతుకం… వంతెనను పేల్చివేసిన మావోయిస్టులు

ఆ మరుసటి రోజునే ఇండోర్‌లోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో నివసిస్తున్న అశ్విని యాదవ్ మృతదేహం బైపాస్‌లోని ఖాళీ మైదానంలో రక్తపు మడుగులో పడి ఉందని తెలుసుకున్న పోలీసులు  ఆ ప్రాంతాన్నంతటిని జల్లెడ పట్టారు. ఆతడు కత్తిపోట్లకు గురై చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్టులో వెల్లడైంది.  24 గంటల్లోనే హత్యకు పాల్పడ్డ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు

మృతుడు అశ్విని యాదవ్ తన చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ సంబంధం కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత దూరంగా ఉంటానని ఇద్దరూ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. దీని తర్వాత కుటుంబ సభ్యులు గోపాల్ పగారేతో అమ్మాయి పెళ్లి చేశారు. కానీ అశ్విని, అమ్మాయి ఇద్దరూ ఇందుకు అంగీకరించలేదు. ఒకరితో ఒకరు నిరంతరం మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈ విషయం యువతి భర్త అయిన గోపాల్‌కు తెలిసింది.

Also Read : సార్ వచేదెప్పుడో- తనిఖీలు చేసేదెప్పుడో.. కానరాని ఫుడ్ ఇన్స్పెక్టర్

అతడు తన తన భార్య, అశ్విని ఇద్దరికీ ఈ విషయం గురించి చెప్పిచూశాడు. మరోసారి ఇలా చేయొద్దని వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఇందుకు ఇద్దరూ అంగీకరించలేదు. వారి మధ్య వివాహేతర సంబంధం కూడా కొనసాగుతోందని తెలిసిన భర్త గోపాల్ కసితో రగిలిపోయాడు.  ఈ క్రమంలో రాజు అనే వ్యక్తిని  కలిసి అశ్వినిని చంపేందుకు గోపాల్ లక్షన్నర రూపాయల సుపారీ ఇచ్చినట్లు అంగీకరించాడు.

రాజు లక్షన్నర రూపాయలకు అనార్, సునీల్‌తో కలిసి అశ్వినిని చంపేందుకు  ముగ్గురూ కలిసి అశ్వినిని వెంబడించారు. అశ్విని లోడింగ్ ఆటో డ్రైవర్. కిరాయికి సరుకులు తీసుకెళ్తానని చెప్పి రాజు అశ్వినిని పిలిచాడు. ఆ తరువాత ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి కత్తులతో అతడిపై దాడి చేశారు. హత్యను బయటపెట్టిన పోలీసులు రాజు, అనార్‌అనే వ్యక్తులు అరెస్ట చేసారు.  సునీల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి ..

  1. విజయసాయిని తిట్ల‌తో కుమ్మేసిన బండ్ల గణేష్
  2. హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర.. 8 వేల మంది పోలీసులతో పహారా
  3. చైనాలో కొవిడ్ కల్లోలం.. ఆంక్షలతో 40 కోట్ల మందికి నరకం
  4. తెలంగాణలో కాంగ్రెస్ కు ఎన్ని సీట్లంటే.. లేటేస్ట్ సర్వేలో సంచలనం…
  5. ధాన్యం దిగుమతులపై తెలంగాణ అధికారుల డేగ కన్ను

ad 728x120 Garuda copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.