
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా మహమ్మారి. ఇటీవలే థర్డ్ వేవ్ రూపంలో విరుచుకుపడింది. భారత్ లో ఇప్పుడిప్పుడే మూడో దశ తగ్గుముఖం పట్టింది. అటితే కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని ఇప్పట్లో వదిలేలా కన్పించడం లేదు. కరోనా థర్డ్‌వేవ్ నుంచి ఊపిరిపీల్చుకునేలోగా శాస్త్రవేత్తలు ఉలిక్కిపడే విషయాలు వెల్లడించారు. కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభం కాగానే..మరింత ఆందోళన రేగింది. అదృష్టవశాత్తూ కేసుల సంఖ్య త్వరగానే తగ్గుముఖం పట్టింది. ప్రాణనష్టం తక్కువగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్న పరిస్థితి. కరోనా సెకండ్ వేవ్ నుంచి థర్డ్‌వేవ్ ప్రారంభమయ్యేందుకు 6 నెలల సమయం పట్టింది. అటు కోవిడ్ ఫస్ట్‌వేవ్ నుంచి సెకండ్ వేవ్ ప్రారంభమయ్యేందుకు 4-5 నెలల సమయం పట్టింది. కరోనా థర్ద్‌వేవ్‌తో మహమ్మారి ముగిసిపోతుందని అంతా అనుకుంటున్న తరుణంలో కాన్పూర్ ఐఐటీ పరిశోధకులు ఉలిక్కిపడే అంశాలు వెల్లడించారు. ఇదే ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది.
కరోనా ఫోర్త్‌వేవ్ ఎంట్రీ ఇవ్వనుందని కాన్పూర్ ఐఐటీ పరిశోధకులు చెబుతున్నారు. మరో నాలుగు నెలల్లో కరోనా ఫోర్త్‌వేవ్ ప్రారంభం కావచ్చనేది కాన్పూర్ ఐఐటీ పరిశోధకుల అంచనా. జూన్ నెలలో ప్రవేశించి..అక్టోబర్ వరకూ ఉంటుందని చెబుతున్నారు. ఇండియాలో కరోనా ఫోర్త్‌వేవ్ జూన్ 22 నాటికి ప్రారంభం కావచ్చని తాజా అంచనా. అయితే కరోనా ఫోర్త్‌వేవ్ తీవ్రతపై ఇంకా అంచనా వేయలేదు. ఇది వైరస్ సంక్రమణ, కొత్త వేరియంట్ బట్టి ఉంటుందని తెలుస్తోంది. కోవిడ్ బూస్టర్ డోసు, వ్యాక్సినేషన్ వంటి అంశాలపై కరోనా ఫోర్త్‌వేవ్ తీవ్రత ఎలా ఉంటుందనేది తెలుస్తుందని కాన్పూర్ ఐఐటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి కరోనా ఫోర్త్‌వేవ్ పీక్స్‌కు చేరుతుందని అంచనా. గతంలో కరోనా థర్డ్‌వేవ్ విషయంలో కచ్చితంగా అంచనా వేసింది కూడా కాన్పూర్ ఐఐటీ పరిశోధకులే కావడం గమనార్హం.
ఇవి కూడా చదవండి ..
- అర్ధరాత్రి.. బస్సు వెనక సీటులో మహిళపై డ్రైవర్ అత్యాచారం!
- కాంగ్రెస్ టికెట్లపై రేవంత్ రెడ్డి సంచలనం..
- కారెక్కనున్న పీకే.. తెలంగాణలో సంచలనం?
- జగ్గారెడ్డితో కలిసి కోమటిరెడ్డి జంప్?