International

లీటర్ పెట్రోల్ ధర 338.. వామ్మో ఇంత దారుణమా?

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : శ్రీలంకలో సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో సామాన్యుల బతుకు నరకప్రాయంగా మారుతోంది. ఇప్పటికే చుక్కలనంటిన నిత్యావసరాల ధరలతో జనాలు కడుపునింపుకోవడానికే నానా కష్టాలు పడుతున్నారు. పెట్రోల్ కొరత, కరెంటు కష్టాలతో తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. విదేశీ మారకద్రవ్య నిల్వలు అడుగంటుతుండటం, శ్రీలంక రూపాయి విలువ దారుణంగా పతనమవుతుండటంతో ఆ దేశం కోలుకోలేని సంక్షోభంలో చిక్కుకుపోతోంది.

ఇప్పటికే బతుకుభారమైన శ్రీలంకవాసులపై మరో పిడుగు పడింది. పెట్రో ధరలను భారీగా పెంచుతూ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ఒకేసారి ఏకంగా పెట్రోల్ ధర 84 రూపాయల మేర పెంచింది. దీంతో లంకలో లీటర్ పెట్రోల్ ధర 338 శ్రీలంక రూపాయలకు చేరింది. అయితే ఇంత ధర పెట్టినా ఆదేశంలో పెట్రోల్ మాత్రం తగినంత లభ్యం కావడం లేదు. దీంతో రేషన్ పద్దతిలో కోటా పెట్టి మరీ పెట్రోల్ ను సరఫరా చేస్తోంది ఆ దేశ ప్రభుత్వం.నిత్య కష్టాలతో విసిగెత్తిపోయిన శ్రీలంక ప్రజలు కొద్దిరోజులుగా తీవ్రనిరసన తెలుపుతున్నారు. పలు ప్రాంతాల్లో విధ్వంసానికి దిగుతున్నారు.

తాజాగా కొలంబోకు వెళ్లే జాతీయ రహదారులను దిగ్బందించారు నిరసనకారులు. రోడ్లపై టైర్లు అడ్డంగా వేసి నిప్పంటించారు. దీంతో కొలంబోకు రాకపోకలు నిలిచిపోయాయి. రాజపక్సే సర్కారే ఈ సంక్షోభానికి కారణమని శ్రీలంకవాసులు బలంగా విశ్వసిస్తున్నారు. ప్రభుత్వం గద్దెదిగాలని దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. అటు సంక్షోభంలో చిక్కుకుపోయిన శ్రీలంకకు భారత్ పెద్ద ఎత్తున సాయం చేస్తోంది. నిత్యావసరాలతో పాటు మెడిసిన్, పెట్రో ఉత్పత్తులను రవాణాచేస్తోంది.

ఇవి కూడా చదవండి ..

  1. ఏపీని లంకలా మార్చేస్తారా! సీఎం జగన్ మాజీ అడ్వైజర్‌ సంచలనం..
  2. రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. టీఆర్ఎస్ గూటికి కొడంగల్ కాంగ్రెస్ లీడర్స్
  3. భూకబ్జా కేసులో ఏపీ బీజేపీ ఎంపీ.. తీవ్రంగా స్పందించిన బండి సంజయ్
  4. ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఆరీఫ్‌ఖాన్‌! మోడీ మైనార్టీ కార్డ్!
  5. రోజుకు లక్షల కేసుల బీర్లు… వామ్మో తాగుడే తాగుడు!

ad 728x120 Garuda copy - Crime Mirror

Show More

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Continue in browser
Crime Mirror
To install tap
and choose
Add to Home Screen
Continue in browser
Crime Mirror
To install tap Add to Home Screen
Add to Home Screen
Crime Mirror
To install tap
and choose
Add to Home Screen
Continue in browser
Crime Mirror
To install tap
and choose
Add to Home Screen
Continue in browser

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.