
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రపంచదేశాల్లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోన్న చైనాలో మాత్రం వైరస్ విజృంభణ ఆగడం లేదు. ప్రస్తుతం ఏ దేశంలోని ఆంక్షలు అక్కడ అమలు అమలవుతున్నాయి. ఇప్పటికే షాంఘైతోపాటు పలు నగరాలు లాక్డౌన్లోకి వెళ్లాయి. కోవిడ్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. చైనాలోని వంద ప్రధాన నగరాల్లో దాదాపు 87 చోట్ల ఆంక్షలు కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 37.3 కోట్ల మంది ఆంక్షల్లోనే జీవనం సాగిస్తున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.ఆంక్షలను కఠినతరం చేసినా వైరస్ ఉధృతికి అడ్డుకట్ట పడటం లేదు.
చైనాలో ఒక్కరోజే 3 వేల 472 కరోనా కేసులు నమోదైయ్యాయి. అనధికారికంగా 20 వేలకు పైగా ఉన్నాయని తెలుస్తోంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కరోనా పరీక్షలకు ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇటు పొరుగు దేశాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రావిస్సులోనూ కరోనా తీవ్రత అధికంగా ఉంది. కున్షాన్లో లాక్డౌన్ విధించారు. దీంతో తైవాన్‌కు చెందిన దిగ్గజ టెక్ కంపెనీలు మూతపడ్డాయి. వైరస్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
చైనాలోని ప్రధాన నగరాల్లో కోవిడ్ ఆంక్షలతో చాలా సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. ఐఫోన్ తయారీదారు పెగాట్రాన్ కార్పొరేషన్, టెస్లా, నియో వంటి కార్ల తయారీ సంస్థలు మూతపడ్డాయి. ఈతరహా కోవిడ్ ఆంక్షలు కొనసాగితే ఆటోమేకర్స్ ఉత్పత్తిని నిలిపివేసే పరిస్థితి ఉందని వాహన తయారీ సంస్థలు చెబుతున్నాయి. లాక్డౌన్, ఆంక్షల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే పరిస్థితి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా నియంత్రణకు కోవిడ్ జీరో విధానానికి కట్టుబడి ఉన్నామని చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి ..
- హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర.. 8 వేల మంది పోలీసులతో పహారా
- తెలంగాణలో కాంగ్రెస్ కు ఎన్ని సీట్లంటే.. లెటేస్ట్ సర్వేలో సంచలనం…
- ధాన్యం దిగుమతులపై తెలంగాణ అధికారుల డేగ కన్ను
- చత్తీస్ ఘడ్ లో మావోల ఘాతుకం… వంతెనను పేల్చివేసిన మావోయిస్టులు
- ఆర్టీసీ ఛార్జీల పెంపు పై టీడీపీ ఆందోళన
4 Comments