International

ల* కొడకా… జర్నలిస్ట్ ను బండ బూతులు తిట్టిన అమెరికా అధ్యక్షుడు

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రపంచానికే పెద్దన్నగా పిలుచుకునే దేశానికి అధ్యక్షుడు.. అయినా విచక్షణ మరిచిపోయారు.. ఓపెన్ గానే నోరు జారారు. తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. వెంటనే తప్పును గ్రహించి క్షమాపణ చెప్పారు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎప్పుడూ హుందాగా, ప్రశాంతంగా కనిపించే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఒక్కసారిగా సహనం కోల్పోయారు. ఓ జర్నలిస్టుపై బూతులతో విరుచుకుపడ్డారు. కాస్త ఇబ్బందికరమైన ప్రశ్నను సంధించిన జర్నలిస్ట్‌ను ఉద్దేశించి బూతులు తిట్టారు. ఆయన తనలో తానే ఈ బూతు మాటను బయటపెట్టుకున్నప్పటికీ హాట్ మైక్‌లో అది రికార్డయింది. అందరికీ వినిపించింది.

రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని నివారించడానికి అమెరికా తీసుకున్న చర్యలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలను వివరించడానికి జో బైడెన్ తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌లోని ఈస్ట్ రూమ్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారు. వైట్‌హౌస్‌ కార్యకలాపాలను కవర్ చేసే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున దీనికి హాజరయ్యారు. ప్రెస్ కాన్ఫరెన్స్ దాదాపుగా ముగింపుదశకు వచ్చిన సమయంలో ఫాక్స్ న్యూస్ ఛానల్ కరెస్పాండెంట్ పీటర్‌ డూసీ, అధ్యక్షుడు బైడెన్‌ను ద్రవ్యోల్బణంపై ఒక ప్రశ్న అడిగారు. ఈ మధ్యంతర కాలంలో ద్రవ్యోల్బణం ఏర్పడటానికి రాజకీయ స్థితిగతులు బాధ్యత వహించాల్సి ఉంటుందని భావిస్తున్నారా? అని సూటిగా ప్రశ్నించిన జర్నలిస్ట్ కి..”ద్రవ్యోల్భణం గొప్ప ఆస్తి” అంటూ వెటకారంగా సమాధానమిస్తూనే..”వాట్‌ ఏ స్టుడిప్.. సన్ ఆఫ్ బిచ్(ల* కొడకా) అని తనలో తాను అనుకున్నారు. ఈ వాక్యాన్ని బైడెన్ గట్టిగా ఉచ్ఛరించలేదు గానీ.. అక్కడి హాట్ మైక్‌లో రికార్డయింది.

Read More : అక్రమార్కులను కఠినంగా శిక్షించాలి… – Crime Mirror

మైక్‌ ఆన్‌లో ఉన్న విషయాన్ని గమనించని బైడెన్‌.. ఆ తర్వాత సిబ్బంది ఆ విషయం చెప్పడంతో సైలెంట్‌ అయిపోయారు. అయితే డూసీ సైతం ఆ కామెంట్లను సరిగ్గా వినలేకపోయాడట. ఆపై బ్రీఫ్‌ రూంలో ఆ కామెంట్లను విని చిన్నబుచ్చుకున్నాడట. అయితే ఈ ఘటన జరిగిన గంట తర్వాత వ్యక్తిగతంగా డూసీకి కాల్‌ చేసి మరీ బైడెన్‌ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. ‘అది తన వ్యక్తిగతంగా చేసిన కామెంట్‌ కాదని ఆయన ఆ జర్నలిస్ట్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. బైడెన్ క్షమాపణలతో ఈ వివాదం ముగిసినట్లయ్యింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నోటి దురుసు వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఇవి కూడా చదవండి ..

  1. అక్రమ కట్టడాల కూల్చివేతపై జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేత
  2. లోటస్ పాండ్ కు తాళం,, షర్మిల చేతులెత్తేసిందా..?
  3. ‘భీమ్లా నాయ‌క్‌’తో మారిన ప‌ద్మ‌శ్రీ మొగుల‌య్య జీవితం..
  4. ఏపీలో కొత్త జిల్లాలు- రాజధానులు ఇవే..!

WhatsApp Image 2021 06 19 at 4.16.03 PM - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.