పవన్ కళ్యాణ్ స్పీచ్ పై… ఆసక్తికరంగా స్పందించిన చిరంజీవి!..

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. నిన్న జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి ఎక్స్ వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ లో జయకేతనం పేరుతో ఈ సభను ఏర్పాటు చేయగా… భారీ ఎత్తున ప్రజలు హాజరవడం జరిగింది. ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గతంలో తనపై ఎన్నో కేసులు పెట్టారని… అంతేకాకుండా చాలా కుట్రలు చేశారని అన్నారు. అసెంబ్లీ గేట్ కూడా తాకలేమని ఎంతోమంది ఎన్నో రకాలుగా సవాలు విసిరిన, ఇప్పుడు అసెంబ్లీలోనే కాలర్ ఎగరేసుకొని కూర్చున్నాను అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోని మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ మాటలకు దాసోహూలయ్యారు.

రేవంత్ మరో మోసం..ఇందిరమ్మ ఇళ్లు ఇప్పట్లో లేనట్టేనా?

ఎక్స్ వేదికగా స్పందిస్తూ చిరంజీవి తన మనసులోని మాటలను బయటపెట్టారు. మై డియర్ బ్రదర్ పవన్ కళ్యాణ్… జనసేన జయ కేతన కార్యక్రమంలో నీ స్పీచ్ కు మంత్రముగ్ధుడినయ్యాను. సభకు వచ్చిన అశేష జనసంద్రంలా నా మనసు ఉప్పొంగిందంటూ చెప్పుకొచ్చారు. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చి నాయకుడు చెడన నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమ స్ఫూర్తితో నీ జైత్రయాత్ర నిర్విగంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జనసైనికులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు… అంటూ పవన్ పై చిరంజీవి ప్రశంసలు కురిపించారు.

టీడీపీలో యనమల భవిష్యత్‌ ఏంటి..?- రాజ్యసభ స్థానమా, రాజకీయ సన్యాసమా..?

Exit mobile version