CRIME NEWSHyderabadTelangana

గులాబీ అధినేతకు బిగ్ షాక్… ఆకేసులో నోటీసులు!!!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్‌కు నోటీసులు అందాయి. ఈనెల 15 లోగా వివరణ ఇవ్వాలంటూ జస్టిస్ నర్సింహారెడ్డి ఈ నోటీసులు జారీ చేశారు. కాగా విచారణకు హాజరయ్యేందుకు జులై 30 వరకు సమయం కావాలని కేసీఆర్ కోరారు. మూడు అంశాల విచారణ కొనసాగుతోందని పవర్ కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నోటీసుల్లో పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్లపై విచారణ కొనసాగుతోందని అన్నారు.

టెండర్ల ప్రక్రియ లేకుండా ఒప్పందాలు జరిగాయని, 25 మందికి నోటీసులు ఇచ్చామని నరసింహారెడ్డి పేర్కొన్నారు. కాగా మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఇంకా సమాధానం ఇవ్వలేదని, సమయం కావాలని కోరారని వివరించారు. మాజీ సీఎండీ, ప్రస్తుత సీఎండీలతో సమావేశం అయ్యామని తెలిపారు. నిన్న (సోమవారం) మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, నాటి ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ చందాతో సమావేశం అయ్యామని నరసింహా రావు వివరించారు.కాగా మూడు నిర్ణయాలు అప్పటి ప్రభుత్వం మాత్రమే తీసుకుందని పవర్ కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డి పేర్కొన్నారు.

Read Also : చంద్రబాబు ….స్ట్రాంగ్ వార్నింగ్

జెన్‌కోకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఎస్‌కే జోషి, అరవింద్ కుమార్‌లతో ఇవ్వాళ (మంగళవారం) సమావేశం అయ్యామని చెప్పారు. అరవింద్ కుమార్ అప్పుడే రేగ్యులేటరీ కమిషన్‌కు లేఖ రాశారని, అయితే పట్టించుకోలేదని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగినప్పుడు కేంద్రానికి అధికారం ఇవ్వాలని, అయితే రెండు రాష్ట్రాల ఒప్పందంతో ఛత్తీస్‌ఘడ్‌కు అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. భారీగా నిధులు ఖర్చు చేసి పవర్ కొనుగోలు చేశారని, మొత్తం ప్రక్రియలో ఎంత నష్టం అనేది తేల్చాల్సి ఉందని నరసింహా రెడ్డి పేర్కొన్నారు. ఇక భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీని పెట్టారని, అంతటా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టారని నరసింహా రెడ్డి వివరించారు. యాదాద్రిలో నామినేషన్ బేస్‌లో ఇచ్చారని, ఇంకా పూర్తి కాలేదని అన్నారు. ఆగస్టు వరకు ఒక లైన్ అందుబాటులోకి వస్తుందని అంటున్నారు కానీ రైల్వే‌లైన్ వెయ్యలేదని పేర్కొన్నారు. అధికారుల నుంచే కాకుండా ప్రముఖులు నుంచి కూడా సమాచారం తీసుకుంటున్నామని అన్నారు.

ఇవి  కూడా చదవండి : 

  1. తిరుమలలో భక్తుల రద్దీ… సర్వ దర్శనానికి 18 గంటలు
  2. సిడి ఆవిష్కరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ……
  3. రిజర్వాయర్ పనులను అడ్డుకున్న భునిర్వాసితులు …
  4. సీఎం క్యాంప్ ఆఫీస్ ఎక్కడంటే ….!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.