Andhra Pradesh

కృష్ణ, గుంటూరు జిల్లాలకు పెను గండం.. ప్రళయంగా మారిన అసని తుఫాన్!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అసని తుపాను ముప్పుతిప్పలు పెడుతోంది. ఐఎండీ అంచనాల్ని తలకిందులు చేస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి హఠాత్తుగా దిశ మార్చుకుని..దక్షిణాంధ్రవైపుకు కదిలింది. అసనీ తుపాను ముందు నుంచీ ఊహించని పరిణామాలకు గురి చేస్తోంది. తొలుత సాధారణ తుపానుగా అంచనా వేయగా..రూపం మార్చుకుని తీవ్ర తుపానుగా మారింది. ఆ తరువాత మధ్యాహ్నం వరకూ ఉత్తరాంధ్రవైపుకు ఒడిశా దిశగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో దూసుకురావడంతో.. ఉత్తరాంధ్ర సమీపంలో తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. అయితే ఉన్నట్టుండి దిశ మార్చుకుంది. అది కూడా పూర్తి వ్యతిరేక దిశలో మార్చుకుంది. ఉత్తర కోస్తా నుంచి దక్షిణ కోస్తావైపుకు మారింది. ప్రస్తుతం అసనీ తుపాను మచిలీపట్నం-బాపట్ల తీరాల మధ్య కేంద్రీకృతమై ఉంది. రేపు సాయంత్రానికి మచీలీపట్నం వద్ద తీరం తాకనుంది. ఆ తరువాత మచిలీపట్నం నుంచి విశాఖ వరకూ భూభాగం మీదుగా..తిరిగి సముద్రంలో ప్రవేశించే అవకాశాలున్నాయని తాజాగా ఐఎండీ అంచనా వేస్తోంది.

Also Read : ధాన్యం దిగుమతులపై తెలంగాణ అధికారుల డేగ కన్ను

తుపాను గమనం దక్షిణ కోస్తావైపుకు కదలడంతో ప్రస్తుతం ఒంగోలు, బాపట్ల, తిరుపతి జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. మచిలీపట్నం తీర ప్రాంతంలో భారీ ఈదురుగాలులు వీయనున్నాయి. తుపాను కారణంగా ఒంగోలు, అద్దంకి, మచిలీపట్నం, దివిసీమ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి.

పది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

అసనీ తుపాను కారణంగా ఏపీలోని పది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణ, గుంటూరు జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉండనుంది. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య కడప జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది. మాత్రం కృష్ణా, విజయవాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉంటుంది. అసనీ తుపాను వేగం కూడా గంటగంటకూ మారుతోంది. తీరం దాటే సమయంలో తుపాను మరింత తీవ్రం కావచ్చనేది ఓ అంచనా.

ఇవి కూడా చదవండి ..

  1. మునుగోడులో ఒంటరైన కూసుకుంట్ల! టీఆర్ఎస్ కు కొత్త లీడర్ ఎవరో?
  2. రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. బీజేపీలోకి కోమటిరెడ్డి, కొండా?
  3. బిగ్ బ్రేకింగ్: నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ అరెస్ట్
  4. దొంగ అకౌంట్ నుంచి డబ్బులు కాజేసిన ఇన్సిపెక్టర్.. హైదరాబాద్ ఖాకీల్లో కలవరం..
  5. జైలు సూపరింటెండ్ నిమ్మకాయల స్కాం.. విచారణకు ఆదేశం

ad 728x120 Garuda copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.