
క్రైమ్ మిర్రర్, అమరావతి : ఈనెల 22న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలులో పర్యటించనున్నారు. అయితే జగన్ పర్యటన కోసం ఒంగోలు పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం రోడ్డుపై వెళుతున్న కార్లను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్న శ్రీనివాస్ కారును పోలీసులు తీసేసుకున్నారు. తమను మధ్యలోనే ఆపేస్తే ఎక్కడికి వెళ్లాలని శ్రీనివాస్ పోలీసులతో వాదించాడు. అర్ధరాత్రి పిల్లలతో ఇబ్బంది పడతామని చెప్పినా పోలీసులు కరుణించలేదు. కారును పోలీసులు లాకెళ్లడంతో అర్థరాత్రి రోడ్డుపైనే ఉంది శ్రీనివాస్ కుటుంబం.
Read More : బట్టేవాజ్, లుచ్చాగాడు.. మోడీని టార్గెట్ చేసిన కేటీఆర్
పోలీసుల తీరుపై టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం RTA అధికారులు ప్రజల కారును బలవంతంగా తీసుకెళ్లడం ఏపీలో దారుణ పాలనకు సాక్ష్యంగా నిలుస్తుందన్నారు చంద్రబాబు. కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్న వినుకొండకు చెందిన వేముల శ్రీనివాస్ కారును రవాణాశాఖ అధికారులు లాక్కెళ్లడం అత్యంత దారుణమన్నారు. కుటుంబ సభ్యులతో వెళుతుండగా రోడ్డున పడేయాల్సిన అధికారం అధికారులకు ఎవరిచ్చారని చంద్రబాబు నిలదీశారు. సీఎం కాన్వాయ్ కోసం ప్రజల వాహనాలు తీసుకెళ్లడం సిగ్గుచేటైన విషయమన్నారు టీడీపీ అధినేత.
మరోవైపు ఒంగోలు కారు లాక్కెళ్లిన ఘటనపై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వెళ్తున్న వాహనదారుడి కారు లాక్కోవడంపై విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ ఘటనకు బాధ్యులుగా చేస్తూ హోంగార్డ్ తిరుపతి రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్సిపెక్టర్ సంధ్యపై యాక్షన్ తీసుకోవాలని డీటీసీ కృష్ణవేణికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో హోంగార్డును సొంత శాఖకు పంపిస్తూ డీటీసీ ఉత్తర్వులు ఇచ్చింది. ఏఎంవీ సంధ్య పాత్రపై విచారణ జరుపుతున్నారు అధికారులు.
ఇవి కూడా చదవండి ..
- 3 గంటలు రోజా హైరానా.. ఉరుకులు పరుగులు.. ఏమైందో తెలుసా!
- తెలంగాణలో ఫ్యాక్షన్ సీన్.. టీఆర్ఎస్ కౌన్సిలర్ దారుణ హత్య
- తెలంగాణలో మాస్క్ లేకుంటే వెయ్యి ఫైన్..
- బిగ్ బ్రేకింగ్.. జగన్ కు థ్యాంక్స్ చెప్పిన చంద్రబాబు
- అర్ధరాత్రి అమ్మాయి దగ్గర డబ్బుల్ వసూల్! కానిస్టేబుల్, హోంగార్డ్ అరెస్ట్
2 Comments